Sunday, March 6, 2016

Summer special - ICE FRUIT STICKS

ICE FRUIT STICKS
Summer time. So cool the summer with these fruit Sticks. I took this recipe from internet
Ingredients:
Fruits of your choice,except citrus fruits. Citrus fruits may turn bitter sometimes
Coconut water preferably
Or any fruit juice or plain water with misri.
These are healthy options. If not bothered about calories you can use simple sugar solution.
Sabja seeds.( Optional)
Method:
Chop the fruits finely.
Soak the sabja seeds with less water for 5minutes
Add the chopped fruits to the fruit juice or coconut water or misri or sugar solution.
Add the soaked sabja seeds.
Pour them into moulds. I used Tupperware ice cream moulds. Otherwise we can use small cups or tumblers. Put a ice cream stick if using cups or tumblers.
Freeze overnight.
To demoyld. Keep it outside for one minute. Then loosen the ends. Your  ICE FRUIT STICKS are ready.

Monday, February 29, 2016

ఈ బ్లాగ్ లో ఇది నా మొదటి పోస్టు. ఈ సంవత్సరం మొదలు లొనే జరిగిన ఒక సంఘటన తో శుభారంభం చేస్తా.
మొన్న జనవరి లో వచ్చిన సంక్రాంతి రోజు మేము చిల్కూరు బాలాజీ గుడి కి వెళ్ళాము.

 ప్రదక్షిణాలు చేసి బాలాజీ ని దర్శించుకోవటానికి లైన్ లో నిలబడి ఉండగా అర్చన చేస్తున్నాము అని మా దగ్గరకి పూలు అక్షతలు వున్నా పళ్ళెం తెచ్చి తాకించారు. అరే, బావుందే మనం ప్రత్యేకించి అర్చన అనుకొక పోయినా ఏదో మన చెయ్యి తాకించాము అని సంతోషంగా అనిపించింది.
బాలాజీ దర్శనము తరువాత  పక్కనే వున్న శివాలయానికి వెళ్ళాము. రష్ ఏమి లేదు కాని లైన్ ఆపేశారు. ఇది ఏంటీ, అనుకుంటూ మేము అక్కడే నుంచున్నాము.
నేను ఇంత కాలము వెళ్లిన ఏ గుడిలోను జరగని విశేషము
జరిగింది అక్కడ. దైవ సంకల్పం సంగతి పక్కన పెడితే దానికి తోడయిన మానవ ప్రయత్నం గురించి కూడా చెప్పాలి. ఎదో మాయ జరిగింది అనుకుంటున్నారా?  అలాగ అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఇక్కడ పాటిస్తున్న ఆచారం గురించి నేను చెప్పదలుచుకుంది.
అక్కడి పూజారి, ఆయన పేరు నాకు తెలియదు కాని లైన్ ఆపేసి చెప్పినది ఏమిటంటే " ఇక్కడ అర్చన టికెట్లు వుండవు. ప్రదోష వేళ అర్చన జరిగే టైం కి ఎవరైతే గుడి కి వస్తారో వారి అందరి గోత్ర నామములు తో సంకల్పము చెప్పి అర్చన చేస్తారు" అని. ఇది బాగా గుడి టైమింగ్ తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ  ఆ టైం కి వెళ్ళడానికి కుదురుతుంది కాని, ఎక్కడెక్కడి నించో భక్తులకి అలాగా కుదరదు కదా.
ఆ పూజారి గారు చెప్పింది ఏమిటంటే అర్చన టైం కి ఎవరు అక్కడికి వస్తారో వారి అందరికీ స్వామి వారి విశేష కృప కలిగి నట్టు అని ఆశీర్వదించారు. ఇంతే కాక అక్కడి క్షేత్ర పాలకులు, మిగతా దేవుళ్లు గురించి చెప్పారు. అమ్మవారు కాక అక్కడ కాలభైరవుడు ఇలాంటి దేవుళ్లు కూడా ఇక్కడ వున్నారు.
"సినిమా టికెట్ల కోసం విసుగు విరామము లేకుండా లైన్ లో గంటల తరబడి నుంచోగలిగిన వాళ్ళము, భగవంతుని కోసం అర్చన సంకల్పము చెప్పే కాస్త టైం లైన్ ఓపిగ్గా ,కాదు కాదు, భక్తిగా ,శ్రద్ధగా నుంచోలేమా? మీ పిల్లలకి ఇది అలవాటు చేయండి. భగవంతుని తో బంధం ఎరపర్చుకునేల మీరు ప్రయత్నిచండి" అని అన్నారు.
 వింటుంటే నిజమే కదా అనిపించింది.మంచి ఆచారాలని ప్రోత్సహించండి,నలుగురు కి చెప్పండి ,ప్రచారం చేయండి అన్న ఆ పూజారి మాటల స్ఫూర్తి తో నా తొలి బ్లాగ్ మొదలు పెడుతున్నా.
గుడి లోకి ఫోన్ అనుమతించనందువలన నెట్ లో దొరికిన ఈ ఫోటో లో చూడచ్చు.