Monday, August 28, 2017

అపార్ట్మెంట్ వినాయక చవితి 2017






మా అపార్ట్మెంట్ కట్టి పన్నెండు సంవత్సరాల లో మేము మొట్టమొదటిసారి పిల్లల్ల కోరిక పై వినాయకుడిని పెట్టాము.
తొలి ప్రయత్నముగా బాల వినాయకుడు చాలని మూడు అడుగుల ఎత్తు వినాయకుడిని పెట్టాము. చాలా చోట్ల లాగా మా దగ్గర కూడా స్త్రీ శక్తి జిందాబాద్.
వినాయకుడి ని,పత్రి,పూలు,పళ్ళు తెచ్చి ..
మండపం అలంకరించి,పిల్లల్లతో మొదటి రోజు పూజ చేయించాము.






రెండవ రోజు మా ఫ్లాట్స్ లో ఇద్దరు దంపతులు కూర్చుని పూజ చేసారు.. శనివారం రాత్రి అవడము తో డిన్నర్ పెట్టుకున్నాము..పాల తాళికలు,అలసందల గుగ్గిలు,పూరి,బంగాళదుంప ముద్ద కూర, మిక్స్డ్డ్ వెజ్ కొబ్బరి వేసి,ఫ్రూట్ సలాడ్,పులిహోర,రవ్వ కేసరి మా మెనూ.






మూడవ రోజు ఉద్వాసన చెప్పి కదంబం,దద్దోజనం,పాయసం, జిలేబి,తీపి బూందీ ల తో మా వినాయక పూజ ముగించాము.అందరూ సరదాగా వెళ్లి నిమజ్జనం కూడా చేసి వచ్చాము.
మా పిల్లలు అందరూ సంగీతము ,డాన్స్ నేర్చుకోవడముతో అందరూ చక్కగా పాటల పాడి,డాన్సులు చేశారు. అలాగ భక్త్యోపచార,రాజోపచార పూజలు చేసాము.















భక్తి లోపం లేదు కానీ,బడ్జెట్ లోపము తో pot luck లాగా చేసుసుందాము అనుకున్నవాళ్ళం అందరము కలిసే వంటలు చేసాము
ఎంత ఆనందముగా అందరూ ఒకటే అన్నా భావన ఎంత బావుందో...నిమజ్జనం అయ్యిపోయాక అందరమూ కలిసి పకోడీలు తిని,కాఫీ లు తాగేసి,లెక్కలు వేసేసి,స్వస్తి చెప్పాము.
ఇదంతా తాత్కాలికం అని మాకు తెలుసు మర్నాటి నించి అపార్టుమెంటలిటీ మాములే..ఎంత ఎక్కువ తాత్కాలికాలు అయితే అన్నీ సార్లు ఆనందము కదా ..........

ఇంత ఫ్రీగా ఎలాగా చేయగలిగాము అంటే..మొన్న జనవరిలో జరిగిన ఎలక్షన్స్ లో మేము అంతా లేడీస్ కమిటీ మెంబెర్లుగా ఎన్నిక కాబడ్డాము. 
అంత సజావుగా సాగుతుందంటే మా ఫ్లాట్స్ లో మగవాళ్ళు అంత సపోర్టింగ్ పిల్లర్లుగా నిలబడ బట్టి.
స్వస్తి. 



Friday, August 25, 2017

Vinayaka chavithi 2017

మా పెళ్ళైన తరువాత మేము విజయనగరంలో వుండే వాళ్ళము. అప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ లో సత్యరావు అని ఒక ఆయన వుండేవాడు. వాళ్ళింట్లో తయారు చేసిన వినాయకుని బొమ్మ అని వినాయక చవితికి ఒక వినాయకుడి బొమ్మ తెచ్చి ఇచ్చారు. అతని చెయ్యి మహత్యము ఏమో కాని ఇంతవరకు ప్రతి వినాయకచవితికి ఒక వినాయకడు బొమ్మ ఎవరో ఒకరు గిఫ్ట్ గా ఇస్తూనే వున్నారు. ప్రతి వినాయక చవితి కి అతన్ని తలచుకుంటాము మేము..
నా "సుబ్రహ్మణ్యానికి"ఈ గణపతి అన్న.
పిల్లల్లో తో చేరి ఉన్న వినాయకులని తీసి తుడిచి బొట్లు పెట్టి,పూజ చేయడం సరదాగా మొదలై ఇప్పుడు ఆనవాయితి అయిపోయింది.
పెందరాడే పూజ చేసుకుని బయటకు వెళ్లాలని ఆయన హడావిడి,అంత హడావిడి పడలేక నేను ....దానికి తోడు" నా సుబ్రమణ్యం' చదువు కోసం అని దూరాన వుండడము, ఆ వినాయకులందరికి ఇప్పుడు తీయద్దు GHMC వాళ్ళు ఇచ్చిన "పర్యావణ గణపతి" తో పూజ చేసేసుకుందాం అనుకుంటే,మా అమ్మాయి ఒప్పుకోలేదు.
అన్ని వినాయకులని తుడిచి ,బొట్లు పెట్టి ఆదే అమర్చింది.
కింద ఫోటోలలో రెండు వినాయకుల మధ్య ఠీవిగా కూర్చున్న గణపయ్య ఈ సంవత్సరము మా గృహం పావనము చేసినది.
భక్తి లోపము లేదు,ఈ రోజు నైవేద్యము....
Vijayalakshmi Pothuri గారు చెప్పినట్టు అన్ని రకాలు చేద్దాము అనుకుని,
సొరకాయ పప్పు,బంగాళదుంప వేపుడు,ముక్కల పులుసు, టమాటో పచ్చడి,గోధుమపిండి హల్వా... ఉండ్రాళ్ళతో సరిపెట్టాము.





Wednesday, August 23, 2017

Thank you

Live by gratitude. It is the mantra for the life.
శుభోదయం...
జీవితములో ఎక్కువ తక్కువలు ఉంటూనే వుంటాయండి.

అది సృష్టి పరిణామ క్రమములో జరిగే మార్పుల లో నిన్న-నేడు-రేపు ,పగలు రాత్రి ఎలాగా సహజమో...ఇవాళ దుఃఖం ,రేపు ఆనందము కూడా సహజము.
ఇంతలో కంగారు పడి తల్లకిందులు అయిపోతే రేపటి ఆనందము అనుభవించొద్దు??
మరి ఇవాళ బాధ దాటేదెలా???
తెలుగు లో కృతజ్ఞత,ఇంగ్లీష్ లో థాంక్ యు,హిందీ లో షూక్రియా....నాకు ఇన్ని భాషలే వొచ్చు,😊

మన మది తలుపులు తెరిచి ప్రపంచాన్ని చూస్తే,లోకములో మనకన్నా కష్టాలు పడే వాళ్ళు బోలెడు మంది.

థాంక్ యు అనుకోండి.. వాళ్ళ కన్నా మనకు తక్కువ కష్టాలు ఉన్నందుకు. అంతే గాని, వాళ్ళ కష్టాలలో సుఖాన్ని వెతకి మీ కష్టాలు పెంచుకోకండి.

థాంక్ యు చెప్పుకోండి.

భగవంతుడికి,మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు...
మీ  పని వారికి....డైరెక్ట్ గా చెప్పకండి...వాళ్ళు కంగారు పడి పని మానేసి అవకాశం ఉంది. సో,మనసులో చెప్పుకోండి..😊😊

మీకు  జీవితము నేర్పిన ప్రతి పాఠానికి థాంక్స్ చెప్పండి. మనసు కి ప్రశాంతత వస్తుంది.జీవితము ఆనందమయము అవుతుంది.