Dec24వ తేది సాయంత్రం చాలా ఆనందంగా గడిచింది. దీనికి కారణం ఈ ఆహ్వన పత్రిక చూస్తే మీకు తెలుస్తుంది.
శ్రీ వేమూరి కనకదుర్గ గారి స్మృతి లో వారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ పావని గారు..
వారి అమ్మమ్మ గారికి ఇష్టమని ఒక సంగీతసభ ఏర్పాటు చేశారు. ఈమె హింది సాహిత్యం లో డాక్టరేట్ పొందారు. ఒక వైపు సాహిత్యం మరొ వైపు సంగీతాసక్తి.
ఈ సభ ప్రత్యేకత ఏమిటంటే పాడినవారు, వయొలిన్, మృదంగం వాయించిన వారు అందరు ముక్కు పచ్చలారని పిల్లలే. ఇంకా నేర్చుకుంటున్నవారే.
వీరు గురువు గార్లు. శ్రీ పి. విద్యాసాగర్ గారు మరియు శ్రీ కొమాండురి అనంత శౌరి రాజన్ గారు.
పాడి న పిల్లలను చూస్తే ముచ్చట వేస్తుంది. మీరు చూడండి
వయొలిన్, మృదంగం వాయించిన వారు
వచ్చిన శ్రోతలు కూడ సంగీతం యందు అసక్తి కలవారు అవటంచేత ప్రశాంతముగా చెవులకు వీనులవిందు అయింది.
ఆనందిస్తున్న అబాలగొపాలం
మా అమ్మాయి చి.సౌమ్య కూడ ఇందులో ఒక కృతి పాడింద
ఇంత మంచి ఆలోచన చేసిన పావని గారికి కృతజ్ఞతలు చెబుతూ, నా ఫోన్ సరిగా లేకపొవడం చేత ఫోటోలు సరిగా రాలేదు.. అయి9 ఈ కార్యక్రమము గురించ్ మీకు చెప్పలవ్న నా తాపత్రయం అర్ధం చేసుకుంటారు అనుకుంటూ శెలవు.


















No comments:
Post a Comment