Thursday, March 29, 2018

కబుర్లు

మొన్న Lavanya Buddhavarapu బయటకి చెప్పారు,మిగతావాళ్ళు చెప్ప లేక పోవచ్చు,కానీ ఆడవాళ్ళు మాట్లాడితే కబుర్లు అని,ఎందుకు పనికి రానివని, అదేదో సామెత కూడా ఉంది కదా,"పగటి మాటలు పనికి చేటు,రాత్రి మాటలు నిద్రకు చేటు" అని. ఇలాంటివి అన్ని విని మన అందరమూ నిజమే కదా,ఆ టైం కాస్త మిగలితే ఇంకో పని చేసికోవాలి కానీ కాకమ్మ కబుర్లు ఎందుకు కూడు పెడతాయా?. గూడు కడతాయా?అని బోలెడు ఫీలింగ్స్ పెంచుకుంటాము. నా బోటి వాళ్ళు వచ్చి మాట్లాడించిన బోలెడు గిల్టీ ఫీల్ అవుతాం.
ఇప్పుడు పైగా అందరికి ఫిట్నెస్ ధ్యాస కూడా పెరగటం తో టైం వుంటే యోగ చేయాలి లేదాపరిగెత్తాలి అంతే కాని వేస్ట్ చేయరాదు.ప్రొడక్టీవ్, constructive use of time is very important. అందుచేత మాట్లేవ్,మాట్లాడుకోటాలు లెవ్. ఈ పరుగు పందాల బతుకుల్లో  ఆగితే గాలి పీల్చుకోగల టైం కూడా లేదు ఇంకా మాటలు కూడానా???
నేను M.A.Anthropology  చేస్తున్నప్పుడు ఒక చిన్న సర్వే గురించి చదివాను. ఒక గ్రామములో ప్రతిగి ఇంటికి ఒక పంచాయతీ పంపు పెట్టించారట. వాళ్ళ ఉద్దేశం ఆడవాళ్లు దూరం నుంచి నీళ్లు మోసుకు రాకుండా  తప్పుతుంది అని. పంచాయతీ వాళ్లు ఆ స్కీం ఎలాగా జరుగుతుందో అని చూడడానికి వెడితే ఎవరూ ఆ పంపులు వాడడంలేదుట. ఎందుకంటే, దూరముగా వెళ్ళేటప్పుడు వాళ్లు ఒకరికొకరు తోడు గా  కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ తిరిగి వచ్చేవారు. దీని వలన వారికి ఒక సోషల్ బాండింగ్ ఏర్పడి, ఒక విధమైన ఉత్సహం వచ్చేది. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి, ఎవరు ఇంట్లో నీళ్లు వాళ్లు పట్టుకోవడము లో వారికి ఆ సోషల్ బాండింగ్ లేక ఒంటరితనం గా అనిపించి, ఆ పంపులు  వాడడము మానేసి దూరం వెళ్లే నీళ్లు మోసుకొచ్చేవారట. అప్పటి నివేదిక ఏమిటంటే, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సోషల్ ఇంప్లికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని.కానీ ఇదే మాట మేము చెబితే కబుర్లు అని కొట్టిపరేస్తారు కదా. పైగా మన వాళ్ళ కన్నా బయట వాళ్ళు చెబితే చాలా నమ్మకంగా ఉంటుంది కదా. ఈ మధ్యనే ఒక వాట్సాప్ షేర్ వచ్చింది. Stanford University వారు నిర్మావహించిన సర్వే తేలింది ఏమిటంటే ఆడవారు మిగతా ఆడవారి తో కలిసి కాస్త కాలం గడపటం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది అని. వారి అమ్మ, అక్క చెల్లలు,మిగతా girl friends తో టైం గడపటం వలన వారిలోని సెరొటోనిన్ హార్మోన్ పెరిగి,వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని, ఎందుకంటే ఆడవారు వారి భావాలను పంచుకోగలగటం వలన  వారు మంచి support system maintain చేసుకోవటమే కాక బలమైన బంధాలను పెంచుకోవడము వలన జీవితములో రకరకాల సమస్యలను తేలిగ్గా అధిగమించిగలుగుతారట.
మనం సరదాగా సమయం గడపకపోతే అది ciggarette తాగినంత హానికారమట. కాకపోతే దాని గురించి చెబుతారు,దీని గురించి ఇంకా ఎవరూ చెప్పలేదు.
సో, next time మీరు టైం తీసుకుని  మీ ఫ్రెండ్స్ ని ,కుటుంబం లో మిగతా ఆడవారిని కలవటానికి వెళ్ళండి. అది మీ ఆరోగ్యానికి కాదు వారి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది.బిందాస్ గా కబుర్లు చెప్పుకోండి,ఆరోగ్యముగా ఉండండి.....

Tuesday, March 27, 2018

Joint family

సాధించే అత్తగారు/భరించే కోడళ్ళు-సాధించే కొడళ్ళు/భరించే అత్తగారు అప్పుడు వున్నారు-ఇప్పుడు వున్నారు.
అది ఒక మనిషి personality పైన ఆధారపడి ఉంటుంది.
షుమారు 45 సంవత్సరాల క్రితం కోడళ్ల తన కొడుకుని కాదాని  వెళ్ళిపోతే 2,4 సంవత్సరాల  మనవరాళ్లు అన్యాయం అయిపోతారని ఆరు నెలలు వెతికి తీసుకుని వచ్చి కొడుకు కుటుంబం ,కొడళ్ళు మనవరాళ్ల జీవితం నిలబెట్టినది ఒక అత్తగారు.

మొగుడు తాగుబోతు ఇల్లు పట్టించుకోకపోతే బంధు మిత్రులు ఎవరు  సపోర్ట్ కి రాకపోతే తన కొడుకుల్ని ఒంటి చేత్తో చదివించి ఆఫీసర్లని చేసింది ఒక తల్లి...మొగుడిని చుట్టాలని వదిలి పెట్టలేదు...

పెళ్లి అయిన కొత్తలో space ఇవ్వడం అనేది ముఖ్యం.
దానికి చాలా పరిమితులు ఉంటాయి
ఇంట్లో మనుషులు మనస్తత్వాలే కాక ఆర్థికం....అంతకన్నా ముఖ్యముగా  ఆ జంట ఒకరిని ఒకరు ఎంత అర్ధం చేసుకున్నారు అన్నది.

కలిసి ఉండాలి వద్దా అంటే???
చుట్టం చూపుగా వచ్చిన అత్తగారు జబ్బు పడితే మామగారి ఊరు వెళ్లి చూపించుకుంటాము అంటే వద్దు ఇక్కడే ఉండండి...నేనె చూసుకుంటా అని అన్ని సపర్యలు చేసిన కొడళ్ళు ఉన్నారు.
ఏ బంధంలో నైనా ఎప్పుడోఅప్పుడు కొంచెం friction రావడం సహజం.
దానిని అధిగమించి వెళ్ళాలి ....
అంతే కానీ దాని కోసం మన కుటుంబము నుంచి దూరం వెళ్తామా??
ఏ ఇద్దరి మధ్య అయినా మనసులు కలవడం ముఖ్యం
కలవలేదు అంటే తటస్థము గా ఉంటే సరిపోతుంది.
ముక్కుకు జలుబు చేస్తే ముక్కు కోసుకొముగా, మందు వేసుకుంటాం
జన్మ జలుబు అనుకోండి
hand kerchief ,inhaler పట్టుకుని తిరుగుతాం.
అలాగే మనిషి మనస్తత్వం తెలిసినప్పుడు మనం యదోచితముగా ఉండడమే...

But one thing is for sure....in any relation no one should force or coerce you.
అది accept చేసి మనం ఉన్నాము అంటే ఆ బంధానికి విలువే లేదు.....
అది ఎవరితో అయినా సరె....
మనసులు కలిసి వున్నప్పుడు...మనుషులు కలిసి వున్నారా లేదా అన్నది పెద్ద తేడా రాదు.
అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే సరిపోతుంది

2017 ugaadi

శుభోదయం.
ఉగాది వస్తోంది.చెట్లు మీది పండుటాకులు,ఎండుటాకులు రాలిపోయి కొత్త గా ఆకులు చిగురిస్తున్నాయి. మావిచిగురు, మామిడి చెట్టు పూత,పిందె,కాయ,పండు.
మన బంథాల లో -చుట్టాలు, ఆన్నదమ్ములు,అక్కచెల్లెల్లు,స్నేహితులు లాంటి ఎన్నో బంధాలు ఎండుటాకులు లాగా రాలిపోయి వుంటే (పాపం శమించుగాక)
మావిచిగురు సాక్షి గా చిగురింపచేసుకుందాము.
వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వారి వల్ల మనం చాలా నష్ట పోయం..సరే. వెళ్ళి వాటేసుకుని పెక్ (పెక్ అంటే తెలుసుకోవాలి అంటే మన్మధుడి సినిమా చూడండి)అవసరం లేదు. హల్లో హాయ్ ల తో మొదలు పెడదాం,చిగురు,పూత.పిందె స్థాయి దాటాక కొన్ని వగరు పిందెలు, పుల్లని మామిడి కాయలు కొన్ని,పండిన తియ్యని రసాలు కొన్ని గా మారాతాయి.
అవి ఏమి జరగలేదండి, మరి ఏమి ఫర్వాలేదండి కాలచక్రం లో ఎండుటాకులు రాలిపోతాయి, మళ్ళీ కొత్త చిగుర్ల కాలం..
మన ప్రయత్నం ఫలించక (మళ్ళి పాపం శమించుగాక) వేప పూత లాగా చేదు చిగురే మిగిలింది అనుకోండి.......ఉగాది పచ్చడికి వేప చేదులా జీవితంలోని షడ్రుచుల లో వేపపూతలా మిగతా రుచుల లో.కలపేద్దాం... ఏమంటారు... ఉగాది శుభాకాంక్షల తో

Thursday, March 22, 2018

Success

శుభోదయం
మనం చాలా సార్లు ఎవరైనా జీవితంలో స్ధిరపడ్డారు అంటే ఇల్లు కొన్నారా? కారు కొన్నారా? పిల్లలు ఇంజినీరా? డాక్టరా? అక్కడికి మీరు విజయవంతులా ..కాదండి
మీకు ఇల్లు వుంటే అపార్టమెంటా? ఇండిపెండెంటా? గేటెడ్ కమున్యిటా???
నెక్స్ట్ కొలమానం... కారు. దానిలో ని వివిధ స్థాయిలు దాటాలి
పిల్లల కెరీర్.....ఇంజనీరింగ్ అయితే IIT నా? NIT?కనీసం Universit లో నేనా??ఇంకా మిగతా వాటి parameters కూడా ఇలాగే..
మంచిదే ..అందరూ బాగా వుండాలి ..కాని అత్యుత్తమ స్ధాయిలో వుండాలి . అందరు పరుగులు పెడదాం.
60 మార్కులు వచ్చే పిల్లవాడు 70 మార్కులు తెచ్చుకుంటే గెలుపు పధమే.. 
కాని ఇప్పుడు కొలమానాలు అందరికి ఒకటే చేసి వారి స్ధాయీ బేధాలు ఆలోచించి కుండా అందరికి 100 మార్కులు తక్కువ రాకూడదు.95 మార్కులు కన్నా తక్కువ వచ్చిన వాడు వెధవ.. 60 మార్కులు వాడు 70 కొసం కృషి చేయకుండా 95 మార్కుల కోసం కాపీ కొట్టడం....
రూపాయి లేని రోజు నించి ఇవాళ పది రూపాయలు తెచ్చుకుంటున్నాం.. అది విజయం కాదు....100 రూపాయలు వుండాల్సిందే....దాని కోసం పరిగెత్తి ఏదో ఒకనాడు కూలబడదాం.
మనం జీవితం మొదలు పెట్టిన తొలి మెట్టు దగ్గర్నుంచి చేరిన  ప్రతి అంతస్తు దగ్గర  గమనించుకొని సంతృప్తి తో , విజయ గర్వం తో ఇంకో అంతస్తు ఎక్కే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎంత సాధించాము అన్నది తెలుస్తుంది.
సమాజ కొలమానాలు ఆహుతిలొ మనం సమిధ లు కావద్దు.
గబ్బర్ సింగ్ లాగా మనకి ఎవరికి వారికి ఒక తిక్క వుంటుంది, దాని లెక్క మనమే వేసుకుందాము.
అన్నింటి కన్నా ముఖ్యంగా మనిషి గా మనం ఎంత ఎదిగాం...ఎంత మంది స్నేహితులని సంపాదించుకున్నాం...కనీసం ఆ నలుగురు అన్నా మన కోసం వున్నారా....అది గుర్తిద్దాం
ఏమంటారు ఫ్రెండ్స్.......

Sunday, March 11, 2018

ధైర్యం

శుభోదయం.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడు కి చెప్పిన మొట్టమొదటి మాట ఇది అని మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. మనకు ఉండవలసిన మొట్టమొదటి సంపద ధైర్యం....
వుండకూడని మొట్టమొదటి బలహీనత భయం...
మిన్ను విరిగి మీద పడుతుందమొనని ఆలోచించి ముందే. కంగారుపడి కంగారు లాగా గంతులు పెట్టకండి.
ముందు జాగ్రత మంచిదే... కాని అతి జాగ్రత్త అనవసరం....
ధైర్యం గా వుండండి.... ఏదైనా జరిగే ముందు మనం ఊహించిన, అనుభవించిన భయం , అది జరిగాక ఆలోచిస్తే -అరే దీనికే భయపడ్డామ? అనిపిస్తుంది.
చాలా సార్లు " రజ్జు సర్ప భ్రాంతి" లాగానే గడిచి పోతుంది.....All is well.....  ఏమి కాదు..... అంతా మన మంచికే....