1980 లో శంకరాభరణం రిలీజ్ అప్పటికి 3rd క్లాస్ లో ఉన్నాను. విజయవాడ అప్సర థియేటర్ లో వచ్చిందట. మా ఇంటికి తీర్ధం తిరనాల్లే. ఊళ్ళ నించి జనం "శంకరాభరణం" సినిమా చూడటానికి వచ్చే వాళ్ళు. వాళ్ళకి టికెట్లు ఇప్పించి,మళ్ళీ చూడలనిపిస్తే ఒకసారి చూసేసి రావటం మా నాన్న వంతు. ఏ సినిమాకి అయినా ఇంటర్వెల్ ముందర మాత్రమే వచ్చే మా నాన్న ఒక్క "శంకరాభరణం " మాత్రం 23 సార్లు చూశారంటే.......మా ఇంట్లో ఆ సినిమా కు ఉన్న క్రేజ్ మీరు అర్ధం చేసుకోవచ్చు.
అతిధి మర్యాదలు మా అమ్మ వంతు.
సినిమా చూసి వచ్చిన వాళ్ళు దాని గురించి డిస్కషన్సు.
మమ్మల్ని ఒకసారి సినిమాకు తీసుకు వెళ్లారు. అందులో శంకరాశాస్త్రి ని చూస్తే భయం వేసేది.
పైగా ఆ పాత్రలో మా అమ్మ కనిపించేది...మా అమ్మ ఇప్పటికి అంతే... ఏదైనా తేడా వస్తే "సహించదు,క్షమించదు".....కాకపోతే "శారదా" అనదు....."దుర్గమ్మా"అంటుందేమో అని భయం.
ఆ సినిమా కూడా అప్పుడు అర్థం అవలేదండి..తులసి పాత్ర మాత్రం బాగా నచ్చేది. అంతే........
స్వతహాగా మా అమ్మ బాగా పాడుతుంది..దానికి తోడు శంకరాభరణం చూశాక నాకు మా చెల్లి కి సంగీతం మాస్టర్ని ఇంటికి పిలిపించి నేర్పించడం మొదలు పెట్టింది. నాకేమో డాన్స్ ఇంట్రెస్ట్....... ఇష్టం లేకుండా కష్టపడి గీతాలు వరకు లాకొచ్చా....
మా చెల్లోమో చక చాక పాడేసేది...అది "శంకరాభరణం" లో రాజ్యలక్ష్మి టైప్......మా మాస్టర్ గారు ఒక శుభముహూర్తానా మా అమ్మకి చెప్పేసారు.."ఈ అమ్మాయికి సంగీతం రాదు. డాన్స్ నేర్పంచండి"......మా అమ్మ నేను పొడగరిని కావడం వలన "నో"అనేసింది.. ...... 1984 విశ్వనాథ్ వారి "సాగర సంగమం"....కమల్ హాసన్ "వేదం..అణువు అణువున నాదం"అని మొదలు పెట్టగానే. నాకు ఏడుపు ఆగలేదు.....అంతే థియేటర్ లోనే శోకాలు...."నేనూ డాన్స్ నేర్చుకుంటా"" మనసులో అయితే"బాలు"అంత డాన్సర్ అయినట్టే ఊహించుకున్నా ... మా బాబాయ్ హామీ ఇచ్చి ఇంటికి తీసుకు వచ్చాడు.... డాన్స్ నేర్చుకోలేదు కానీ "విశ్వనాథుగారి " సినిమాలు రుచి తెలిసింది..
"శృతిలయలు"లో సత్యనారాయణ "డబ్బులు లేవని అన్నము తినటం మనేస్థామ్మా, ఇది అంతే"అని కళరాధన గురించి చెబితే...."మనకు ఉన్నదాంట్లో చేతనైనది"అనే మా నాన్న లాగా అనిపించారు.
"స్వర్ణ కమలం"ఫస్ట్ డే ఫస్ట్ షో...."సిరివెన్నెల".....మా అమ్మ ప్రత్యేకించి చూపించింది....."సూత్రధారులు".........ఇంకా విశ్వనాథ్ సినిమా అంటే ఇంట్లో చూసి వచ్చేదాకా పండగే....
మా అబ్బాయి టీనేజ్ కి రాగానే "స్వయంకృషి" చూపించా.
మా పిల్లల్లకి సమ్మర్ హాలిడేస్ స్పెషల్ విశ్వనాథ వారి సినిమాలు.
ప్రతి సంవత్సరం ఎదురు చూస్తా "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్"ఇస్తారేమో అని....ఇన్నాళ్టికి .....
"విశ్వనాథ గారి "గురించి చెప్పేటంతా సాహసం నేను చేయలేను కానీ......"శంకరాభరణం శంకర శాస్త్రి అయితే..."దొరుకున ఇటువంటి సేవ"........అని పాడితే...మీ సినిమాలు చూస్తూ, ఎంతో నేర్చుకుంటూ పెరిగిన తరం మేము...మీకు సహస్ర అభివందనములు...