మామ్మగారింట్లో...
ఎండాకాలం సెలవలు కి మామ్మ వాళ్ళ ఊరు వెళ్తాము కదా...కనీసం ఆరుగురు మనవరాళ్లు ఒక మనవడు వుండేవాళ్ళము. అక్షరాల నలభై రోజులు సెలవలు.
వెళ్లిన రోజు సాయంత్రం గోరింటాకు పండగ జరిగేది.
పద్మ అని ఇంటి చాకలి అమ్మాయి కూతురు ఉండేది. మేము ఉన్నన్ని రోజులు మాతోనే ఉండి పోయేది. తను అప్పటికే గోరింటాకు సేకరించి రుబ్బి పెట్టేది.
దొడ్లో పచ్చ కనకంబరాలు కోసి కట్టి ఉంచేది.
గోరింటాకు ఎవరిదో బాగా పండిందో వాదించేసుకుని అన్నాళ్ళు తిని పడుకునే వాళ్ళం.
పొద్దునే పక్షుల కిలకిలరావాల తో మెలకువ వచ్చేది.
అందరికన్నా ముందు లేచిన వారికి పాలు పోయించుకు వచ్చే అవకాశం దొరుకుతుంది.
మా మామ్మ కాఫీ ప్రాణి. రాత్రి వచ్చిన పాలు కాచి , కాఫీ ఫిల్టర్ వేసుకుని ఉంచుకునేది. ఆవిడకి ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు మొహం కడుక్కుని కాఫీ తాగేది.
పదమూడు ఏళ్లకే పెళ్లి అయిందట . మామ్మ వాళ్ళ నాన్నగారిది విజయవాడ. ఈవిడ బస్తి వాసి.
మా తాతయ్య ది పల్లెటూరు .
మామ్మ కి నాజూగ్గా పొద్దునే కాఫీ అలవాటు.
అక్కడ అత్తారింట్లో పొద్దునే చద్దన్నం అలవాటు. అందుకని మా మామ్మ వాళ్ళ నాన్నగారు నెలవారీ కాఫీపొడి,పంచదార కొనిచ్చి,పాలకి డబ్బులు ఇచ్చేవారట...కూతురు కాఫీ లేక పోతే వుండలేదని.
విజయవాడ నించి వెళ్లిన మాకు ఆ గేదేల దగ్గరకు వెళ్తే పాలచెంబు తీసుకుని పాలు పిండి ఇస్తే ఆ నురగ తో భలేగా ఉండేది. అవి తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మా మామ్మ కుంపటి వెలిగించి-గ్యాస్ స్టవ్ వచ్చినా పాలు కాచటం ఆవిడ కుంపటి మీదే చేసేది. మా కోసం తెనాలి నించి తెప్పిచిన bournvita సీసా ,పంచదార డబ్బా ,వరసగా ఏడు గ్లాసులు దగ్గర పెట్టుకుని కూర్చునేది.
పిల్లలు ఒకరొకరు లేచి మొహం కడుక్కుని వచ్చి ఆ కుంపటి దగ్గర కూర్చుంటే bournvita కలిపి ఇచ్చేది. Bournvita తాగుతునప్పుడు మొదలు అవుతుంది. ఈ పూట పొద్దున్న ఏమి చేసుకుందాం అన్న డిస్కషన్.
అందరికన్నా చిన్నవాళ్ళ తో మొదలు, బొబ్బట్లు,బియ్యపు పరమాన్నం, కూరగాయలు వేసి ఉప్మా, గారెలు,పూరి-బంగాళా దుంపలు కూర, సేమియా పాయసం ఇలాగ లిస్ట్ ఉండేది.
రోజుకి ఒకటి చప్పున్న బ్రేక్ఫాస్ట్ కి ఆ ఐటమ్స్ చేసేది.
పొద్దునే అవి తినేసి
వరండాలో కూర్చుని ,ఆల్రెడీ చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు దాచిపెట్టిన చింతపిక్కలు తీసి ఆడుకునేవాళ్ళము.
పుంజి,కట్టు,గుర్రాళ్ళు,ఏనుగులు-గెలిచిన వారు నవ్వుతుంటే ఓడిన వాళ్ళు ఏడ్చే లోపు పదకొండు గంటలకి లోపల నించి పిలుపు వచ్చేది
మా ఊరు నించి తెనాలి కి తాటిముంజేలు తీసుకునివెళ్తారు. వాళ్ళు బస్ ఎక్కేముందర మా ఇంటికి వచ్చి ముంజలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. వాటిని పదకొండు గంటల కి చిన్న నించి పెద్ద వాళ్లకు ఒక్కకరిని కూర్చోపెట్టి ఒక చిన్న ప్లేటు,గ్లాసు పెట్టేది.
ముంజలు వలిచి నీరు గ్లాస్ లోకి ఒంపేది. వాళ్ళ కోట అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళు.అలాగ ఒక అరగంట పైనే అందరికి వలిచి పెట్టి మాకు మంచి పని అప్పచెప్పి తను వంట చేసేది..
ఇంతకు ఆ పని చెప్పలేదు కదా..
బియ్యము లో రాళ్లు ఉంటాయి కదా.అందరికి తలా ఒక ప్లేటు లో పోసి ఇచ్చి ఏరమనేది. ఎవరు ఎక్కువ ఏరితే వాళ్ళు గొప్ప..పిల్లల్ల మధ్యలో ఇంకా కావలసినది ఏముంది. మేము అల్లరి చేయకుండా ఈ పని చేసేవాళ్ళం తాను వంట చేసుకునేది.
మా తాతయ్య పొద్దున్న టిఫిన్ తినేసి ఊరిలో సెంటర్ దాకా ఒక రౌండ్ వెళ్లి ఇంటికి వచ్చి భోజనం టైం దాకా పడకుర్చీలో కునుకు తీసేవారు.
పిల్లలకి ఎండ దెబ్బ తగలకూడదు అని రగ్గులు వరండాలో అరేయించి వాటికి అరగా అరగా నీళ్లు కొడుతూ వుండేవాళ్ళము. లోపల వేపు ఎంత చల్లగా ఉండేదో...
మా మామ్మ వంట చాలా బాగా చేసేది...ముఖ్యముగా పప్పు పులుసు, గారెలు,ఆవడలు,వంకాయ కాల్చి పులుసు పచ్చడి ఆవిడ పేటెంట్.
మధ్యాహ్నం భోజనాలు అయినాక కొంచెం కునుకు తీసేది...
తరువాత ఉండేది..జనరంజని. ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పట్లో ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్లమో....
మేము ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుతున్నాము కాబట్టి మన ఇంగ్లీష్ ప్రతిభా పాటవం చూపించాలి. Lkg లో Johny Johny నించి ఇంటర్మీడియట్ వరకు గుర్తే.
అందరమూ పాటలు పద్యాలు పాడి taperecorder రికార్డ్ చేసేవాళ్ళము.
ఇంక ఇంటికి వచ్చిన పక్కింటి వాళ్ళు,ఎదురింటి వాళ్లకి ఆ రికార్డ్ వినిపించేవాళ్ళం..