సంతోషం నాతోనే మొదలు అవుతుంది....సంతోషం సగం బలం అన్నారు పెద్దలు..కాబట్టి సంతోషముగా ఉంటే మనకు ఎటువంటి పరిస్థితి అయినా చక్కదిడ్డుకోవడం చిటికెలో పని.
సంతోషం నాతోనే మొదలు అవుతుంది..
ఎందుకంటే నేను సంతోషంగా ఉంటేనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది కాబట్టి...
కుటుంబం సంతోషంగా ఉంటే మనం వుండే చుట్టుపక్కల కూడా సంతోషముగా ఉంచగలిగిన అవకాశం మనకు ఉంటుంది కాబట్టి.
మన సంతోషానికి అయినా దుఃఖాన్నికి అయినా మనమే కారకులము అని నేను నమ్ముతాను. కుటంబములో చిన్న చిన్న సర్దుబాట్లు అప్పుడప్పుడు తప్పవు...చాలా సార్లు మనం అనుకున్నట్టు జరగదు.కానీ ఒక ఇల్లాలిగా ,తల్లిగా ఎదురుచూడని ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అధిగమించటము తోనే మనకు ఆనందం దొరుకుతుంది.

నా భర్తకు చేదోడు వాదోడుగా ఆఫీస్ అకౌంట్స్ చూస్తాను.
వంట చెయ్యడం నాకు చాలా సరదా.రకరకాల వంటలు ప్రయత్నం చేస్తా.నా స్ట్రెస్ బస్టర్ కొత్త.వంట ప్రయత్నం చేయడం.
కేక్,biscuit బేకింగ్ అయితే చాలా బాగా చేస్తా. సాధారణంగా చాట్ ఐటమ్స్,స్వీట్స్ ,నార్త్ ఇండియన్ ఫుడ్ అంతా నేను ఇంట్లో నే చేసి పెడతా.
మా పిల్లల చిన్నప్పటినించి చుట్టూ పక్కల పిల్లలతో చిన్న చిన్న నాటికలు వేయించేదాని. వేసవి కాలం సెలవలు వస్తే మా ఇల్లు ఒక ప్లే స్కూల్ లాగా ఉండేది.
పిల్లలకి మన సంస్కృతి సంప్రాదాయాలు తెలియాలి అన్న ఉద్దేశముతో ఎనిమిది సంవత్సరాలు కాలనీ లో ఆడపిల్లల కు ముగ్గులు,సంది గొబ్బెమ్మలు,పాటలు,కోలాటము,జానపద గీతాలు నేర్పించాను.
చదువుల పరంగా మా పిల్లలతో పాటు, అపార్ట్మెంట్ లో పిల్లల్ల కూడా నాకు చేతనైన సాయం చేసాను. వాళ్ళకి వ్యాస రచన,క్విజ్ లాంటి పోటీలలో వివిధ ప్రోజెక్టుల లో సహాయం చేసేదాన్ని..
పిల్లల్లతో ఆడుతూ పాడుతూ,చదువుతూ,ఒక అమ్మ గా నేను చాలా సంతోషం పొందాను...వారిని చదివించడం నాకు ఒక revision లాగా ఉపయోగాపడి నేను" మీలో ఎవరు కోటీశ్వరడు"షో లో 6,40,000 గెల్చుకోవడానికి కారణం అయింది....
పిల్లలు పెద్ద అయినాక నా చుట్టూ వున్న సమాజానికి నేను సాయం చేయడానికి కూడా నేను సంతోషముగా ఉండడమే కారణం అని నేను నమ్ముతాను.
ఆ దారిలో అడపా దడపా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి...కానీ నా కుటుంబం సపోర్ట్, స్నేహితుల ప్రోత్సాహం,పెద్దల సలహాలు వలన నేను ఎంచుకున్న దారిలో నేను సంతోషముగా ఉండి,నా చుట్టు పక్క వారికి కూడా నా పరిధి లో నేను సంతోషపరిచే చెయ్యగలుగుతున్నా.
మనం వెళ్ళేదారి సంతోషంగా ప్రయాణం చేస్తే గమ్యం చేరడం సులువుగా ఉంటుంది..
ఎందుకంటే ప్రతి మజిలీ మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది..
అంతులేని ఈ ప్రయణములో బహుదూరపు బాటసారులము మనము...సంతోషం ఒకటే మనకు దారి చూపే దివ్వెగా....
In Momspresso blog

No comments:
Post a Comment