అమ్మ చేతి ముద్ద...
నాకు ఊహ తెలిసినప్పట్టి నించి పొద్దునే అన్నం తినడం అలవాటు. ముఖ్యంగా అన్నం తిని స్కూల్ కి వెళ్ళేవాళ్ళము..ఎప్పుడైనా ఆదివారమునాడు ఇడ్లి పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు...
అప్పట్లో పొద్దునే తినే భోజనాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు అన్న ఫార్మాలిటీస్ లేని రోజులు.
అసలు breakfast కి రైస్ తింటారా అని ఆశ్చర్యపోతారు ఇప్పటి పిల్లలు.
మా అమ్మ మొదట్లో నేను ఒక్కదాన్నే స్కూల్ కి వెళ్ళేదాని కాబట్టి ఒక చిన్న స్టీల్ గిన్నెలో వేడిగా అన్నం వండి ఉసిరికాయ,చింతకాయ, మాగాయి,గోంగూర,కందిపొడి,కారప్పొడి,అల్లపచ్చడి లాంటివి కలిపి నెయ్యి వేసి పెట్టి,ఆ తరువాత పెరుగన్నం కలిపి పెట్టేది.
తరువాత మా చిన్న చెల్లి కూడా స్కూల్ చేరాక గిన్నె పెద్దద్ది అయ్యింది. మా మామ్మ దగ్గర వుండే పెద్ద చెల్లి 6th క్లాస్ లో విజయవాడ వచ్చి, ఇక్కడ స్కూల్ లో చేరాక ముగ్గురికి కలిపి పెద్ద ఇత్తడి గిన్నె లో వండేది.
మా నాన్న వాళ్ళ అమ్మమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేది. అప్పుడు పొద్దున పూట ఆవిడ కలిపి పెట్టేది.
మా మామ్మ వస్తే ,మామ్మ ఉన్నన్ని రోజులు ఆవిడే కలిపి పెట్టాలి.
అన్నం వద్దు అన్న వాళ్ళని కూడా " ఆఖరి ముద్ద అమృతం" అంటూ చివరిదాకా తినేలాగా చేసేది.
అప్పుడు అందరికి ఆఖరి ముద్దే కావలసి వచ్చేది.
అంతే గిన్నె ఖాళీ.
"కూర్చోపెట్టి పెడితే కుంభాలు ఖాళీ అవుతాయి. " అనేది.
మా నాన్న పొద్దునే ఊరికి వెళ్ళవలసి వస్తే మాతో పాటు రెండు ముద్దలు తిని వెళ్లిపోయేవారు.
మేము పెద్దపిల్లలు అయ్యాక మా మామయ్య కొడుకు స్కూల్ ఫైనల్ అయిపోయి ఖాళీగా ఉన్నాడని మా ఆఫీస్ కి వచ్చేవాడు. మా ఇంటి ఎదురుగానే ఆఫీస్ ఉండేది. కారియర్ మా ఇంట్లో పెట్టుకుని ఆఫీస్ కి వెళ్ళేవాడు..
మేము ఆ కారీయర్ మూత తీసి మాకు నచ్చిన.కూరో పచ్చడో ఉంటే అది వేసుకుని అన్నం తినేసి స్కూల్ వెళ్లిపోయేవాళ్ళము. మా అమ్మ తను వండింది మధ్యాహ్నం మా బావకు వేసి భోజనం పెట్టేది.
చింతకాయ బెల్లము వేసి నూరేది మా అత్తయ్య-ఎంత బావుండేదో..
కొబ్బరి పచ్చడి,నువ్వుల పొడి ఎంత బాగా చేసేదో.
వేసవి కాలం సెలవుల్లో కూడా అంతే మా అమ్మ ,పెద్దమ్మ దగ్గరో ఉంటే మా అక్కలకి(పెదనాన్నగారి పిల్లలు) మాకు ముద్దలు కలిపి అన్నం పెట్టేసేవారు. అది తినేసి నేను మా చిన్నక్క చెరో నవల అద్దెకు తెచ్చుకుని నేల మీద ఒక దిండు వేసుకుని ఒక వైపు అది,ఒక వైపు నేను పడుకుని మధ్యాహ్నం కల్లా ఆ నవల చదివేసి,మాలో మేము పుస్తకం మార్చుకుని సాయంత్రానికి ఇద్దరమూ రెండు నవలలు చదివేసేవాళ్ళము. లెండింగ్ లైబ్రరీ లో ఒక నవల కి రోజుకి అర్ధ రూపాయి. మేము సాయంత్రం వెళ్లి ఒక రోజుకి అర్ధ రూపాయి కదా,మేము సాయంత్రానికి తెచ్చి ఇస్తున్నాము ఇంకో పుస్తకం ఇచ్చి రేపటికి అర్ధరూపై తీసుకో అని బేరం ఆడి ఇంకో నవల తెచ్చుకునేవాళ్ళము.
ఇంట్లో ఒకటి రెండో రోజులు చూసి అమ్మ వాళ్ళు ఫుల్ క్లాస్ పీకేవాళ్ల్లు అప్పుడు జోరు తగ్గేది.
కానీ సెలవుల్లో మా మామ్మగారి ఊరు వెళ్తే అప్పుడు.పొద్దున్నే అన్నం కాదు.
మేము కజిన్స్ అందరం- ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు. రోజుకి ఒకరి ఛాయిస్. పూరి,పరమాన్నం,బొబ్బట్లు,గారెలు,దోసెలు,ఉప్మా ఇలా ఎవరికి ఏ పిండి వంట కావాలంటే అది పొద్దునే తినేయటం.మధ్యాహ్నం భోజనం
మా పెద్ద బాబాయ్ మాత్రం పిల్లలకు పొద్దునే అన్నం పెడితే మొద్దుబారిపోతారు అనే వాడు. కానీ మా ఇంట్లో మా అమ్మవాళ్ళు వినేవారు కాదు. పైగా మాకు అలవాటు చేసేసారు. ఇప్పటికీ పొద్దున్న ఎనిమిది గంటలకల్లా ఆకలి వేస్తుంది.
మా పిల్లలకు కూడా నేను పొద్దునే అన్నం తినడమే అలవాటు చేసాను. వాళ్ళు పొద్దున తిని వెళితే ఇంకా స్కూల్ ఒక్కోసారి తినకపోయినా సాయంత్రం దాకా కాస్త ఓపిక ఉంటుంది. నన్ను చాలా మంది అడిగేవారు మీ పిల్లలు ఎలా తింటారు? మా పిల్లలు తిన్నారు అని. ఇంక కొంతమంది పిల్లలు అసలు breakfast చేయకుండానే స్కూల్ కి వెళ్లి పోతారట...
నేను సాయంత్రం తొందరగా 7గంటల లోపు అన్నం పెట్టేసేదాన్ని. వాళ్ళు ఆకలి అంటే రాత్రి ఒక గ్లాస్ పాలు తాగి పడుకునేవాళ్ళు. పొద్దున్నే ఆకలి ఎందుకు వెయ్యదు?
ఇప్పుడు అంత ఫాషన్..అతి.ప్రేమలు
పిల్లలకి రాత్రి.10గంటల కి పెద్దవాళ్ళతో పాటు పెడతారు.
ఇంక పొద్దున్నే ఏమి తినగలుగుతారు వాళ్ళు?
నేను ఇప్పటికి ఏ exam రాయడానికి వెళ్లినా శుభ్రంగా కొంచెం పెరుగన్నం తిని వెళ్తా..
ఏమి చేస్తాం.
అమ్మ చేతి ముద్ద అలవాటు..అంత మంచే జరుగుతుంది.