ఇవ్వాళ నా creative skills గురించి చెప్పకుండా వుండలేను-మీరు వినక తప్పదు. మాములుగా వంట ఎవరైనా చేస్తాము. కానీ creativity చూపించేది అంతా రెండు సందర్భాలలొా.
1.కొత్త ప్రయొగం మనం అనుకున్నట్లు కాక అది అనుకున్నటు వచ్చినప్పుడు. వాటిని రిపేరు చేసేటప్పుడు నా బుర్ర కి భళే సరదా.
2.ఏమైనా వంటకం మిగిలినప్పుడు. leftovers కి Make over చేసినప్పడే .అయితే ఏమి చేసిన తినే పదార్థం పారవేయకూడదు అనే ఆలొచన తప్ప మిగలినవి/ మిగల్చి చేయాలని దురద్దేశం లేదని గమనించ మనవి.
అయితే ఇవాళ పాకము గురించి చెప్పె ముందర -మా ఇంట్లొ ఉప్పు బాగా తక్కవ వాడతాము. అందు కని బండపచ్చడి ఒక పూట ,మహ అయితే ఒక రొజు మించి తినరు. మొన్న చేసిన బీరకాయ పచ్చడి నిన్న కార్తీక పౌర్ణిమ ఉపవాసము వలన తినలేదు. మరి దాన్ని ఏమి చేయవలె.పొద్దున్నే మెరుపు లాంటి ఆలొచన వచ్చింది.కందిపప్పు కుక్కర్ లొ ఉడికించి,టమాట కొసి పొపు లొ వేసి,అవి మగ్గిన తరువాత బీరకాయ పచ్చడి కలిపా. తరువాత ఉడికిన పప్పు కలిపి ఉప్పు కారం వేశా. పైన కరివేపాకు,కొత్తిమీర చల్లా.
మా అమ్మాయి నా వంటకాలకి taster. "బావుంది అమ్మ, మసాల పప్పులా వుంది" అంది. చాలు నాకు AGMARK ముద్ర పడినట్లే
p.s. నా experiments ని తిని encourage చేస్తున్న మా ఇంట్లొ వాళ్ళకి, వాళ్ళ ఇంట్లొ వంట ప్రయొగం చెడినప్పుడల్లా నా సలహా కొసం సంప్రదించేే నా బంధుమిత్రులు నా కళను పెంపొందించిన అవకాశం ఇచ్చిన వారు -వారికి నా Thanks.

No comments:
Post a Comment