ఆడవాళ్ళు మాట్లాడితే కబుర్లు అని,ఎందుకు పనికి రానివని, అదేదో సామెత కూడా ఉంది కదా,"పగటి మాటలు పనికి చేటు,రాత్రి మాటలు నిద్రకు చేటు" అని. ఇలాంటివి అన్ని విని మన అందరమూ నిజమే కదా,ఆ టైం కాస్త మిగలితే ఇంకో పని చేసికోవాలి కానీ కాకమ్మ కబుర్లు ఎందుకు కూడు పెడతాయా?. గూడు కడతాయా?అని బోలెడు ఫీలింగ్స్ పెంచుకుంటాము. నా బోటి వాళ్ళు వచ్చి మాట్లాడించిన బోలెడు గిల్టీ ఫీల్ అవుతాం.
ఇప్పుడు పైగా అందరికి ఫిట్నెస్ ధ్యాస కూడా పెరగటం తో టైం వుంటే యోగ చేయాలి లేదాపరిగెత్తాలి అంతే కాని వేస్ట్ చేయరాదు.ప్రొడక్టీవ్, constructive use of time is very important. అందుచేత మాట్లేవ్,మాట్లాడుకోటాలు లెవ్. ఈ పరుగు పందాల బతుకుల్లో ఆగితే గాలి పీల్చుకోగల టైం కూడా లేదు ఇంకా మాటలు కూడానా???
నేను M.A.Anthropology చేస్తున్నప్పుడు ఒక చిన్న సర్వే గురించి చదివాను. ఒక గ్రామములో ప్రతిగి ఇంటికి ఒక పంచాయతీ పంపు పెట్టించారట. వాళ్ళ ఉద్దేశం ఆడవాళ్లు దూరం నుంచి నీళ్లు మోసుకు రాకుండా తప్పుతుంది అని. పంచాయతీ వాళ్లు ఆ స్కీం ఎలాగా జరుగుతుందో అని చూడడానికి వెడితే ఎవరూ ఆ పంపులు వాడడంలేదుట. ఎందుకంటే, దూరముగా వెళ్ళేటప్పుడు వాళ్లు ఒకరికొకరు తోడు గా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ తిరిగి వచ్చేవారు. దీని వలన వారికి ఒక సోషల్ బాండింగ్ ఏర్పడి, ఒక విధమైన ఉత్సహం వచ్చేది. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి, ఎవరు ఇంట్లో నీళ్లు వాళ్లు పట్టుకోవడము లో వారికి ఆ సోషల్ బాండింగ్ లేక ఒంటరితనం గా అనిపించి, ఆ పంపులు వాడడము మానేసి దూరం వెళ్లే నీళ్లు మోసుకొచ్చేవారట. అప్పటి నివేదిక ఏమిటంటే, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సోషల్ ఇంప్లికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని.కానీ ఇదే మాట మేము చెబితే కబుర్లు అని కొట్టిపరేస్తారు కదా. పైగా మన వాళ్ళ కన్నా బయట వాళ్ళు చెబితే చాలా నమ్మకంగా ఉంటుంది కదా. ఈ మధ్యనే ఒక వాట్సాప్ షేర్ వచ్చింది. Stanford University వారు నిర్మావహించిన సర్వే తేలింది ఏమిటంటే ఆడవారు మిగతా ఆడవారి తో కలిసి కాస్త కాలం గడపటం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది అని. వారి అమ్మ, అక్క చెల్లలు,మిగతా girl friends తో టైం గడపటం వలన వారిలోని సెరొటోనిన్ హార్మోన్ పెరిగి,వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని, ఎందుకంటే ఆడవారు వారి భావాలను పంచుకోగలగటం వలన వారు మంచి support system maintain చేసుకోవటమే కాక బలమైన బంధాలను పెంచుకోవడము వలన జీవితములో రకరకాల సమస్యలను తేలిగ్గా అధిగమించిగలుగుతారట.
మనం సరదాగా సమయం గడపకపోతే అది ciggarette తాగినంత హానికారమట. కాకపోతే దాని గురించి చెబుతారు,దీని గురించి ఇంకా ఎవరూ చెప్పలేదు.
సో, next time మీరు టైం తీసుకుని మీ ఫ్రెండ్స్ ని ,కుటుంబం లో మిగతా ఆడవారిని కలవటానికి వెళ్ళండి. అది మీ ఆరోగ్యానికి కాదు వారి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది.బిందాస్ గా కబుర్లు చెప్పుకోండి,ఆరోగ్యముగా ఉండండి.....

No comments:
Post a Comment