ఆహార వీధి
కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి.
అది ఒక పెద్ద ఆహార వీధి. It is called a dining street .అంటే మన ఇంట్లో హాల్లో డైనింగ్ టేబుల్ వేస్తాము కదా అలాగా ఒక వీధి అంతా డైనింగ్ టేబుల్ అన్న మాట. ఆ వీధిలో ఉన్న ఇళ్లల్లో ఒక ఇల్లు ఆవకాయ ఇల్లు,ఒక ఇల్లేమో మెంతికాయ ఇల్లు,ఒక ఇల్లు కందిపొడి నిలయం, ఆ ఇంటి పంపులోంచి నెయ్యి ,నూనెలు వస్తాయి అన్న మాట. పండుమిరప్పల కారానికి ఒక ఇల్లు, గోంగూర గారి బంగ్లా ఒకటి. చింతకాయ,నిమ్మకాయ,ఉసిరికాయ అక్క చెల్లెలు. ఒకే ఇంట్లో ఉంటాయి అన్న మాట.
అంటే మనం జాడిలో పచ్చడి పెట్టుకుంటాము కదా…. అలాగా డైనింగ్ స్ట్రీట్ అంత టేబుల్ కోసం ఇల్లంత జాడీలు ఆన్నమాట.
ఇంకొక ఇంటి పేరు పచ్చిపులుసు నివాస్. ఒక ఇల్లు పనసపొట్టు కూర,
మరి ఇంటి అలమరలు ,బీరువాల్లో ఏముంటాయో తెలుసా….. అరిసెలు,కజ్జికాయలు,బొబ్బట్లు,సున్నిఉండలు…
భోషాణాలలో కారపూస,చెక్కలు,వెన్నఉండళ్లు,జంతికలు,కారపు బూందీ ఉంటాయి అన్నమాట.
ఇవి తినేవారు ఎవరంటే….…నీకు ఉన్న పద్నాలుగు మంది పిల్లలు,వారి పిల్లలు,ఇంకా వాళ్ళకి పిల్లలు పుడితే - కౌరవ సంతానానికి ఈ మాత్రము ఏర్పాటు లేక పోతే ఎలా??? అని చిన్నప్పుడు మా మామయ్య మా అమ్మని ఏడిపించేవాడు…
………..
“ఊహించుకుంటేనే ఎంత బావుంది తాత,”అన్నాడు నా మనుమడు…
“నిజమే,కానీ జరుగుతున్నది ఏమిటి?”
మీ ఇంట్లో ఉన్న 6 సీటర్ dining table మీద కనీసం నెలకి ఒకసారి అన్నా అంత మంది కూర్చుని తింటున్నారా?” అడిగాడు తాత.
“ఎలాగా? మేము ఉన్నదే నలుగురం కదా”అన్నాడు మనుమడు…
“మరి నువ్వు నీ తమ్ముడు పెద్ద అయి వెళ్లిపోయారు అనుకో అప్పుడు రెండు కుర్చీలు చాలుగా?”అన్నాడు తాత
“సెలవులు కు వస్తాముగా,అన్నాడు మనుమడు
“కుదరకపోతే”??సందేహం తాతది.
“కుదుర్చుకుంటాం” నమ్మకం మనవడి ది.
“అలాగే జరిగి వుంటే , మా పద్నాలుగు మంది అక్క చెల్లలు ,వాళ్ళ సంతానము,సంతానాన్ని సంతానము కలిస్తే కావలసింది ఆహార వీధేగా??
మరి ఎక్కడ ఆగిందో ఆలోచించు,”
“కలుపుదాం, ఆహార వీధిలో విహరిద్దాం “అంటూ భరోసా ఇచ్చాడు మనవడు…
తృప్తిగా నవ్వాడు తాత….

No comments:
Post a Comment