ధనుర్మాసం, నెల పడుతున్నారు అంటే కొంత మందికి ఒక రకమైన హడావిడి.
మేము చదువుకున్న స్కూల్ మిషనరీ స్కూల్ కావడం తో మాకు క్రిస్మస్ కి వారం ముందు సెలవలు మొదలై,సంక్రాంతి వరకు సాగేవి.
దాని తో ...చలో మామ్మాగారి ఊరు.
ఆరునెలల ఆఖరు పరీక్ష వ్రాసి ,మధ్యాహ్నం స్కూల్ నించి రాగానే...అన్నం తినేసి..ఎవరోఒకరు మమ్మల్ని ఊరికి తీసుకు వెళ్ళడానికి సిద్ధముగా ఉండేవాళ్ళు..
విజయవాడ నించి తెనాలి వెళ్లి,అక్కడ నించి పంతొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే,మా మామ్మగారి ఊరు...పెరవలి..
తెనాలి -రేపల్లె రూట్లో,భట్టిప్రోలు వెళ్లే బస్ ఎక్కితే వస్తుంది.
ఇప్పుడు ఫ్లైట్ లో తిరుగుతున్నాము అన్న పేరే కానీ..
ఆ ప్రయాణం మాజానే వేరు.
విజయవాడ నించి తెనాలి వరకు నాన్ స్టాప్ దొరికితే ఒక రకం..
అదే ఏ పాసెంజర్ అంటే ఇప్పటి పల్లె వెలుగు లాంటిది దొరికిందో......మంగళగిరి ,రేవేంద్రపాడు,నందివెలుగు లాంటి బస్టాండుల్లో ఆగి,జనాన్ని ఎక్కించుకుని...పండుగల టైం లో అయితే కుక్కించుకొని...తీసుకువెళ్ళేవాడు..
ఇంక తెనాలి లో దిగి అక్కడినించి భట్టిప్రోలు వెళ్లే బస్ ఎక్కాలి..
ముందు ఒక అరగంట బస్ కోసం ఎదురుచూడాలి..
ఒక్కోసారి మన ముందునుంచే బస్ వెళుతుంది...అది మళ్ళీ తిరిగి రావాలి..
బస్ ప్లాట్ఫారం మీద ఆగంగానే సన్నగా ఉన్నవాళ్లు,లేక పోతే చిన్న పిల్లలలో ముందు గుంపులోంచి దూరిపోయి
బస్ ఎక్కేసి,కర్చీఫులు,తువ్వాలు వేసి వెనకాల ఎక్కేవాళ్ళ కోసం సీట్ పెట్టాలి...అక్కడే మన నెగ్గుకు వచ్చే తత్వం నేర్చుకుంటాము.
ఇంత చేస్తే ఆ బస్ నిండుగర్భిణి లాగా నడక మొదలుపెట్టి...దారిలో వచ్చే గేదెలు,ఆవులను తప్పించుకుని పెరవలి పాలెం వస్తే ఒక ఆనందం,...
ఇంక గంగోలు....అది కాలవ అన్న సంగతి మాకు డిగ్రీలకు వచ్చేదాకా తెలియదు....
మాకు అది పెద్ద గంగా నది.
ఆ గంగోలు చూడగానే మాకు మొహాలు వికసిస్తాయి....
పెరవలి సెంటర్ స్టాప్....అది దాటగానే సత్రం స్టాప్...పెరవలి ఆఫీషల్ బస్టాండ్..
దాన్ని అనుకునే మా మామ్మగారి ఇల్లు....
బస్ దిగంగానే తాతయ్య నుంచునివుండేవారు.
లోపలకి అడుగు పెట్టగానే మామ్మా గుమ్మములో ......
విజయవాడ నించి గట్టిగా 50 km ల ప్రయాణం....
ఇదంతా ఎనభైలలో సంగతి....
కానీ అదో పెద్ద జ్ఞాపకము....
కూడా వచ్చిన వాళ్లు,తీసుకు వెళ్ళడానికి వచ్చే అమ్మ వాళ్ళు అదో పెద్ద పని,రెండు బస్సులు మారి వెళ్ళాలి అనుకోలేదు..
కారులో వెళ్లాలన్నా ఇవ్వాళ పిల్లలకు కాలు కదపాలి అంటే
...సో...బోరింగ్....
సెలవలు అంటే.....
రిసార్ట్స్,destination ట్రావెల్లింగ్....
అయితే చేతులు కలిస్తే చప్పట్లు....
మా మామ్మా "పండగ- అందరూ ఊరికి రావాలి"-ముఖ్యముగా సంక్రాంతి,దీపావళి,క్రిస్మస్ మరియు వేసవి సెలవులు..పిల్లల్ని పంపండి....అని ఉత్తరం..తరువాత ఫోను చేసేది...మా అమ్మవాళ్ళు కూడా పంపేవాళ్ళు...
వెళ్లిన పిల్లలు అతుక్కుపోయేవారు....
ఇంటికి వెళ్ళాక సెలవుల మాజా ఇంకొక పోస్టులో......

No comments:
Post a Comment