Thursday, September 28, 2017

Jagadish గారి నోట రాముడి మాట

పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు.

అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు.

అందరాని చందమామకోసం అలకలుపోయావు.
కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు.

బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు.

ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు.

ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభని ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు.

తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు.

చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు.

ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభని ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.

ఎంతముద్దుచేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు.

నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానాయాగీ చేసేసింది.

నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదుపొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది.

ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో?

పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు.

‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు.

నీకుతోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు.

తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.

ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు.

డబ్బడిగితే జేబుఖాళీ అంటారు.
పన్చెబితే చెయిఖాళీలేదంటారు.

అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు.

వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు.

నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజుబిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠికిందే పడుకున్నావు.

ఒకటారెండా..పధ్నాలుగేళ్ళు!

ఎన్నోతప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు.

జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మాసరదా తీర్చకుండా బయటే ఊరేగుతూవుంటారు.

అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు.

అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచినవెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు.

నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు.

ఇంటో అన్నీవుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం!

అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆలేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపెంచెంది,  తెద్దాఁవని బయల్దేరావు.

మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు.

ఏమాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు.

నిస్సహాయతనేది సామాన్యమానవుణ్ణి ఎలాబాధిస్తుందో నిరూపించావు.

మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు.

ఎంతో ఇష్టంకాబట్టే ఎంతకష్టపడాలో అంతాపడ్డావు.

ఏసాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ ఆరుమెట్ల పుస్తకాలూ చెప్పలేదు.

తాతయ్య నోటివెంట నీకథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోడమని!

అదీ చూసేవాళ్ళం మాచిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం!

వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది!

ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువుచేసిన స్నేహమూ, ఆనక వాళ్ళసాయంతోనే నువుకట్టిన వారధీ చూస్తే...

దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!

సెభాషోయ్ రామా! నీగురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా!

నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీజీవితం!

నిలకడలేనివాళ్ళతో పొంతన
నీళ్ళని దాటడానికొక వంతెన
నిర్భయమేగావుంటే నీచెంతన
నిరాధారులకిచ్చావు సాంత్వన
నికార్సైనది నీమార్గం ఎంతైనా
నిరతమూ మాకదేకదా చింతన

నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!

నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని
నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!

పదిమందీ కలిస్తే పండగ! పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!

అందాలరాముడు....
అందువలన దేముడు!!

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

                          ..........జగదీష్ కొచ్చెర్లకోట

Sri Rama Navami 2017

శ్రీ రామ నవమి శుభాకంక్షాలు.
రాముడి కి ఇది

1లక్ష 04వేల 257 వ...పుట్టినరోజు అని FB ఫ్రెండ్ ఒకరు పోస్ట్ చేసారు....
నిన్న మా అమ్మాయికి తులసి మొక్క ఇంట్లో ఎందుకు పెంచుకోవాలి అని చెబితే ఇలా reason చెబితే మేము ఫాలో అవుతాము కదా.....ఊరికే ఇది చేయండి మంచిది అని చెప్పే బదులు అన్నది...    .అలాగే ఇన్ని సంవత్సరాలు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే. ఎన్నని చెబుతాము. ..రాముడు అంటేనే ధర్మము కాబట్టి.
రాముడు సీతకి అన్యాయం చేసాడు సీతని అడవిలో వదిలేసే అనుకునేదాన్ని నేను కూడా...చాలా రోజులు.... కానీ ఇప్పుడు అనిపిస్తుంది....వాళ్ళ అన్యోన్య దాంపత్యములో వాళ్ళ ఇద్దరికి కారణాలు  బయటకు చెప్పుకోవాలిసిన అవసరము లేదు అని. ఆయన చేశారు...ఆవిడకి అర్ధం అయింది....భార్య భర్తల మధ్యలో మనము ఎవరండి మాట్లాడడానికి అని అర్ధమైంది.
మనిషి పాటించవలసిన అన్ని ధర్మాలు రాముడు సీతా , ఆ మాటకొస్తే భరతడు, లక్ష్మణుడు ఏమైనా తక్కువా? అందరూ ఆచరించారు మనకు ప్రమాణాలు చూపారు....అవన్నీ అందరమూ పాటించగలమా?? ఖచ్చితంగా లేము...
మరి మన నడతలో సందేహము వచ్చింది అనుకోండి శ్రీ రామ పరివారములో ఎవరో ఒకరు మనకు దారి చూపుతారు  ...
ఉడుత దగ్గర నించి దేశము ఏలిన భరతుడు వరకు.....అందరికి ఎప్పుడు ఏమి ,ఎలాచేయాలో తెలుసు.....ఒకసారి చదివి చూద్దాం...ఏ సందేహము కైనా సమాధానం దొరుకుతుంది...ఒక వేళ  దొరకలేదు అనుకోండి విషవృక్షాలు మొలిపించ వద్దు..  .రామాయణం కల్పవృక్షం....దాని నీడన సేద తీరుతూ శ్రీరామ రక్షతో అయురాగ్యాలతో  ఆనందముగా ఉందాము

Thursday, September 14, 2017

Akruthi Public School 14-09-2017

పిల్లలు కి సరైన guidance ఇచ్చి వారికి దిశ నిర్దేశం చేయడములో స్కూల్ ది 50% ,తల్లితండ్రులది 25%
సంఘంది, 25% పాత్ర అని School Psychology ప్రకారం వున్నా, School వంతుగా 75% చేస్తే పిల్లల్లకు మంచిది అని నమ్మి , ఆచరిస్తున్న
          AKRUTHI PUBLIC SCHOOL KARMANGHAT,PRINCIPAL Smt. Madhavi గారికి అభినందనలు.

ఇవాళ ఆ స్కూల్ లో 8th,9th,10th క్లాస్ పిల్లల్లకు  Life Skills గురించి Sahaja Team , #Sahaja Motivational class తీసుకోవడం జరిగింది.

Smt. Sailaja Vissamsetti-
Organising Secretary,Telangana Psychologists Association
Smt. Jonnalagadda Kanaka Durga-
Joint Secretary for Hyderabad District ,Telangana Psychologists Association
Sri Sudhakar-Member, Telangana Psychologists Association.
Participated and Interacted with children.

Sahaja Team wishes Good Luck to the children




Sunday, September 10, 2017

10-09-2017 World Suicide Prevention Day

"Suicide is not a wish to die-but a CRY for help"
September 10th World Suicide Prevention Day గా పాటిస్తున్న సందర్భంగా ఇవాళ
 Telanga Psychologists Association-TPA వారు ఒక కార్యక్రమం నిర్వహించారు.

TPA President Sri Mothukuri Ramchander గారి ఆధ్వర్యంలో,Smt. G.C. Kavitha,Counselling Psychologist, గారు ముఖ్య అతిధిగా ఈ సభ జరిగింది.
"దర్షిక " సంస్థ నుంచి Sri Balaji గారు ముఖ్య వక్త.

ఏటా 1,35,000 మంది భారతదేశం లో ,దాదాపు 10,00,000 మంది ప్రపంచ వ్యాప్తముగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ParaSympathetic Nervous System వలన వచ్చే వత్తిడి మన శరీరము లోని Seritonin మరియు Cortisol Hormones లోని అసమతుల్యత వలన ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
మన శరీరంలో Seritonin ఎక్కువ  ఉండాలి .దానికి వ్యాయామం,ముఖ్యముగా యోగ మరియూ ధ్యానము ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఈ Cortisol హార్మోన్ ఎక్కువ అయితే మనము ఏమి చేస్తున్నామో మన మనసు కి పట్టదు.

 ఈ medical  కారణాలు కాకుండా మానసికంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణము -----ఒత్తిడి.

ఒత్తిడి లేక Stress అన్నది ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి ఎవరు లేరు అని అనుకున్నప్పుడు కలుగుతుంది.

ఒత్తిడి లో వున్నప్పుడు మన మనసు మన మాట వినదు. సరైన నిర్ణయాలు తీసుకొనలేదు. అంతే కాకుండా ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఆ సమయములో వారికి కావలసింది ఒక Empathetic Listener. వారికి మన సానుభూతి అఖ్ఖర్లేదు.కానీ మనం వారికి ఉన్నాము అన్న ఒక ధైర్యం కావాలి.
ఆత్మహత్యలు నివారించాలంటే మనకు కావలసింది "నేను ఒంటరిని కాదు "అన్న అవగాహన వారి లో కలిగించాలి.
I am not alone -అన్న ధైర్యం వారికి కలిగించాలి.
ఒక మాట,ఒక క్షణం చాలు ఆత్మహత్య లు నివారించడానికి.
అందుకే ఈ సంవత్సరం Motto
           "TAKE A MINUTE, CHANGE A LIFE"
Interpersonal relations లో Communication  లేకపోవడము ఆధునిక సమాజము లో ఒంటరితనానికి,
పంచుకునే వారు లేక ఒత్తిడికి గురైనా వారు,
ఒక్క క్షణం ఆలోచిస్తే...
వారితో ఉండేవారు వారి గురించి ఒక్క నిమిషం కేటాయిస్తే....
ఒక ఆత్మహత్య అగుతుంది,ఒక జీవితం నిలబడుతుంది.
రండి మన మనసు తో విందాము....
ఒక జీవితాన్ని బ్రతికిద్దాము.
ఆత్మహత్య ను నివారిద్దము.
Jonnalagadda Kanakadurga
In Face Book


Wednesday, September 6, 2017

Counselling at Kishanreddy School 31-08-2017

గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది కానీ,పిల్లలు భలే హుషారుగా వున్నారు.
మొన్న ఆగస్ట్ 31వ తారీఖు న బాగ్ అంబర్ పేట్ లోని గవర్నమెంట్ హైస్కూల్ పిల్లల్లకి మా Sahaja team "Motivational Class" తీసుకోవడానికి వెళ్ళాము.

"Sahaja" అన్నది ఒక  Professional Psychologists Group. Baghamberpet Corporator  Padmavathi DP Reddy గారు "WOW"Association లో  Wellness aspect లో భాగముగా ,Telangana Psychologists Association తరపున  మా "Sahaja" Team పాల్గొన్నాము.
 పిల్లలతో మాట్లాడం,వారితో భావాలు పంచుకోవాడానికి,నాలుగు మంచి మాటలు చెప్పడానికి మేము ఎప్పుడు ముందుంటాము.

Sahaja Team నించి
Smt.Sailaja Vissamsetti-Organising Secretary- Telangana Psychologist Association
Smt.Jonnalagadda Kanaka Durga-Joint Secretary for Hyderabad District, TPA
Sri Vara Prasad- Secretary for Medak District ,TPA ఈ స్కూల్ కి వెళ్ళాము.

స్కూల్ కి వెళ్లినాక 8th,9th క్లాస్ పిల్లల్ని ఒక రూమ్ లో సమావేశపరిచారు..వాళ్ళకి digi class వుండడము వలన slides తో వారికి అర్ధం అయ్యేలా చెప్పడము మాకు చాలా సులువు అయింది.
ప్రిన్సిపాల్ రూమ్ లో కి వెళ్తుండగానే ఎదురుపడిన పిల్లలు చక్కగా విష్ చేశారు. ముందర కాస్త బిడియపడినా,ఒక 5 నిమిషాలు తరువాత అడిగిన ప్రశ్నలకు ఎంత హుషారుగా సమాధానము చెప్పారో.
"మీ రోల్ మోడల్ ఎవరు అనగానే చాలా మంది పిల్లలు"అబ్దుల్ కలామ్"అని చెప్పటం మన భవిత మీద చాలా ఆశ కలిగించింది..
వాళ్లలో కలిగిన ఆశయానికి నిజముగానే సరైన మార్గానిర్దేశన చేయగలిగితే...నిజముగానే Abdul Kalaam అంత స్థాయి కి చేరగలుగుతారు.
మా Sahaja team లో Smt.Sailaja గారు వారికి తల్లిదండ్రుల మరియు గురువుల యొక ప్రాముఖ్యత గురించి చెప్పగా,
Sri Vara Prasad గారు వారికి PPT slides ద్వారా "Essence of Life & Running your own race"
గురించి చక్కగా వివరించారు.
నేను వారికి చదువుకోవడం యొక్క అవశక్యత,దాని కోసం చేయవలసిన పరిశ్రమ గురించి చెప్పాను.
చివరగా Sailaja గారు Gadgets యొక్క వినియోగం. ...జాగ్రత్తలు,.BlueWhale గేమ్ వాళ్ళ దుష్ప్రభావాలు గురించి చెప్పారు.
Corporator Padmavathi గారు ముఖ్య అతిధిగా విచ్చేసి పిల్లల చదువుకోవడం చాలా అవసరము. ఉన్న వసతులు ఉపయోగించుకుని ఉన్నత స్థానంకి చేరాలని...అందుకు సహాయము చేయడానికి ఎల్లవేళలా తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ప్రిన్సిపాల్ ప్రసూన గారు పిల్లల్లుకు ఇంకా యోగ, ధ్యానంలో శిక్షణా ఇప్పించాలని మిగతా తరగతి పిల్లలకు కూడా ఇలాగ classes conduct చెయ్యాలని కోరారు.



















Motivational sparks 31-08-2017

*Why some people have all the Luck ?*

By Professor Richard  Wiseman, University of Hertfordshire.

Why do some people get all the luck while others never get the breaks they deserve?
A psychologist says he has discovered the answer.

Ten years ago, I set out to examine luck. I wanted to know why some people are always in the right place at the right time, while others consistently experience ill fortune. I placed advertisements in national newspapers asking for people who felt consistently lucky or unlucky to contact me.

Hundreds of extraordinary men & women volunteered for my research & over the years, I have interviewed them, monitored their lives & had
them take part in experiments.

I carried out a simple experiment to discover whether this was due to differences in their ability to spot such opportunities. I gave both lucky and unlucky people a newspaper, and asked them to look through it & tell me how many photographs were inside. I had secretly placed a large message halfway through the newspaper saying : "Tell the experimenter you have seen this and win $50."

This message took up half of the page & was written in type that was more than two inches high. It was staring everyone straight in the face, but the unlucky people tended to miss it & the lucky people tended to spot it.

Unlucky people are generally more tense than lucky people, and this anxiety disrupts their ability to notice the unexpected.
As a result, they miss opportunities because they are too focused on looking for something else. They go to parties'; intent on finding their perfect partner & so miss opportunities to make good friends.
They look through newspapers determined to find certain types of job advertisements & miss other types of jobs.

Lucky people are more relaxed & open, and therefore see what is there rather than just what they are looking for. My research eventually revealed that lucky people generate good fortune via four principles. They are skilled at creating & noticing chance opportunities, make lucky decisions by listening to their intuition, create self-fulfilling prophesies via positive expectations, and adopt a resilient attitude that transforms bad luck into good.

Here are Professor Wiseman's four top tips for becoming lucky:
1) Listen to your gut instincts - they are normally right
2) Be open to new experiences and breaking Ur normal routine
3) Spend a few moments each day remembering things that went well
4) Visualize Urself being lucky before an important meeting or telephone call.
Have a Lucky day and work for it...

"The happiest people in the world are not those who have no problems, but those who learn to live with things that are less than perfect."

" There is a great difference  between "worry"  &  "concern",
A worried person only sees the problem & a concerned person solves the problem..!

May luck be your side!!! 👏😊

{[( WHATSAPP SHARE )]}

Tuesday, September 5, 2017

ప్రాణాసుహిత

ప్రాణాసుహిత....Pranasuhita...ఇది ఒక startup కంపెనీ.
I focus లో సభ్యులైన యువతరం స్టార్ట్ చేసింది.
వీళ్ళు organic కూరగాయలు ఇస్తామని మొన్న శనివారం వచ్చి కలిసి వెళ్లారు. వీళ్ళు చెప్పింది ఏమిటంటే, storage లేకుండా డైరెక్ట్ గా కూరగాయలు కోయగానే మనకు తెచ్చి ఇస్తారట.. farm to home... .🌳🌳🍆🍅🍎🥕🌶️
అంత ఫ్రెష్ అంటే మనకు సంతోషం..పరమానందం కదా....
సోమవారంనాడు ఈ వారం దొరికే కూరగాయల లిస్ట్ పంపారు.
మా ఫ్రెండ్స్ ఒక నలుగురం ఆర్డర్ చేసాము.
బుధవారం పొద్దున్నే 7 గంటల లోపు తెచ్చి ఇచ్చారు.
కూరలు ఫ్రెష్ గా బావున్నాయి.
కూరలు చూడగానే ఉత్సాహంగా మీకు చెప్పా.
రుచి వండాకా చెబుతా.......



Friday, September 1, 2017

Wow mela

WOW.....Women of Wellness
*Women*Wisdom*Wellness*
ఆదివారం ఆడవాళ్లకు సెలవు కాదు కదా..ఆ రోజు ఇంకా పనిభారం పెరుగుతుంది...ఇంటిల్లిపాది కి అన్ని అమర్చి,చూసుకునే ఆడవాళ్లకు వారి గురించి పట్టించుకునే తీరిక,ఓపిక ఏవి?.వారికి ఆటవిడుపు ఏది?

Padmavathi DPReddy Mahila Udyog Centre లో 1st బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న  వారి ఉత్పత్తులను  ప్రదర్శనగా నిర్వహించాలని దానికి తగిన సహాయము కొరకు Baghamberpet Corporator గారిని సంప్రదించడం జరిగింది.  ఆవిడ అప్పుడు D.D. కాలనీ లోని ఇంద్రప్రస్థ నగర్ లోని లైబ్రరీ హాల్ లో "WOW మేళా"
ఒకటి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ WOW థీమ్ లో
Women-ఆడవారికి సంబంధించిన ఉత్పత్తులు
Wisdom-వారి మనోవికాసానికి సంబంధించి ఆటలు,పాటలు
Wellness-వారి మానసిక,శారీరక ఆరోగ్యానికి సంబంధించిన యోగ, meditation,accupressure,కౌన్సిలింగ్ లాంటివి ఈ మేళా లో ఉంటాయి.
ఆగస్ట్ 23వ తారీఖు న  జరిగింది. కాలనీ లోని పెద్దలు తమ వంతు ప్రోత్సాహం అందించగా... మేళా లో beauty ప్రొడక్ట్స్
-organic henna,organic facials,fruit facials,mehendi,nail art మా beautician -Madhavi  conduct చేసారు.
Tailoring విభాగం మా Tailoring teachers-Sailaja,Bhaagya  conduct చేశారు.
Saree petticoats,మగ్గం వర్క్ బ్లౌజులు, పమిటి చెంగు ముడి కుచ్చులు ప్రదర్శించారు.
కుర్తిస్,కుర్తాలు,చీరలు అమ్మారు.
Silk thread sets, పూల జడ బిళ్ళళ్ళు,మరియు అమ్మవారికి,పెళ్లి కూతుళ్ళకి  పూల జడలు ప్రదర్శించారు.
దీనిని CCRT Teacher crafts lo training ఇచ్చే శ్రీమతి పద్మ అత్తలూరి గారు పర్యవేక్షించారు.

Wellness విభాగములో....
శ్రీమతి అలివేలు రెడ్డి,Fitness Yoga Teacher గారు మహిళల కు menopause time లో వచ్చే శారీరక , మానసిక మార్పులు వాటివలన వచ్చే సమస్యలు గురించి చెప్పారు.
వాటి నివారణ  కోసం యోగ  మరియు ధ్యానంలో పద్ధతులు తెలిపారు.

శ్రీమతి శైలజ విస్సంసెట్టి ,psychologist,  Organising Secretary-Telangana Psychologists Association,
పెళ్లి కి ముందర పిల్లల్లకు
ఇవ్వవలసిన కౌన్సిలింగ్ గురించి చెప్పారు.

ఇంకా బింది గేమ్,మ్యూజికల్ ఛైర్స్ ఆడుకున్నాము..
GHMC వాళ్ళు వినాయకచవితి సందర్బంగా ఏకో -గణపతిని Corporator Padmavathi గారి చేతుల మీదగా అందరికి పంచిపెట్టారు.
ఇది మహిళల ఆనందం కోసం చేసిన ఒక చిరు ప్రయత్నం.
అందరికి బాగా నచ్చింది.
మళ్ళీ ఎప్పుడు పెడతారు అని అందరు అడుగుతున్నారు.
రాలేకపోయిన వారు "మేము మిస్ అయ్యాము...ఈ సారి పెట్టునప్పుడు చెప్పండి..తప్పకుండా వస్తాము" అని చెబుతున్నారు.
మా ఈ చిరు ప్రయత్నానికి అండదండా గా నిలబడ్డ BaghAmberpet Corporator Smt. Padmavathi గారికి,
ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న  పద్మగారికి,శైలజగారికి కృతజ్ఞతలు.వారి సహకారము మున్ముందు ఇలాగే మాకు ఉంటాయి అని ఆశిస్తున్నాము.
అలివేలు గారు ఈ ప్రోగ్రాం ఇంత విజయవం సాగటానికి కారణం అలివేలు గారు. ఆమెకు ధన్యవాదాలు.
మా మహిళ ఉద్యోగ్ సెంటర్ సభ్యులు వారి కై వారు సొంతముగా ఉపాధి కల్పించుకొనుటకై కృషి చేస్తున్నారు. మంచి మనసుతో అర్ధం చేసుకుని ప్రోత్సాహించిన వారికి పేరు పేరున మా కృతజ్ఞతలు.