Monday, November 19, 2018

Reunion

నిన్న రాత్రి మేము పంజగుట్ట లొని చట్నీస్ కి వెళ్ళాం. మా బావగారు 6.30 కి చేరుకున్నారు.  ఆడపడుచు అంటే మా పినమామ గారి అమ్మాయి  6.45 కి వచ్చిందట. మేము వెళ్ళినప్పటికీ 7.20 అయింది. మేము తిని బిల్లు కట్టి బయలుదేరేటప్పటికి సమయం 11.00. అప్పటి వరకు ఏమి తిన్నాం? ఏమి చేశాం????????

సస్పెన్స్ ఆపటం నాకు రాదు......చ్చెప్పేస్తా... చ్చెప్పేస్తున్నా.........సాగర సంగమం సినిమా గుర్తుందా.....అందులో కమల్ హాసన్ రెండు తప్పులు అంటాడు కదా... అలాగ.... కాదు కాది రెండు ఒప్పులు జరిగాయి.    మా మామగారి. అన్నదమ్ముల పిల్లలు. ఫ్యామిలీ కి కనీసం ఒకరు చొప్పున కలిసాం.. మా పెదమామ గారు 84 ఏళ్ళ వయస్సు లో ఒపిక చేసుకుని రావడమే కాక మా అందరికి వాళ్ళ ఊరి విశేషాలు చెప్పా రు. అవి వింటుంటే స్వాతంత్ర్య కాలం లోకి వెళ్ళి పోయాం.
It is a family reunion.especiallay of the younger generations. మనకు వున్న అంగబలం ఏమి ఇచ్చినా కొనుకొలేనిది.ఎవరికి ఎవరు ఏమి పెట్టఖ్కర్లేదు..కాని మన వాళ్ళు వున్నారు అన్నది మనిషికి ఎంత ధైర్యం ఇస్తుంది?   
వుంటాయండి చెప్పుడు మాటలు, చేతకాని చేష్టలు. ఏ బంధమైనా difference of opinion వుంటాయి...అవి దాటుకుని ముందుకు వెళ్ళే తెగింపు మనకు లేదా??
మరీ బ్రహ్మొత్సవం సినిమా అయిపొయిందా????
..............
 అయితే మన ఆందరికీ ప్రియమైన తిండి గురించి మాట్లడాదాం.
మేము నాలుగు సార్లు కాఫీలు తాగాం. జొన్నలగడ్డ వారింట్లో కాఫీ డికాక్షన్ వాటర్ ఫిల్టర్ లో వేస్తారని నానుడి.
అందరం బాబయి హోటల్ ఇడ్లీ తిన్నాం. గంట తరువాత మసాలా దోశలు, ఉప్మా పెసరట్ట్లు, కారం ఇడ్లీ, గోబి మంచురియా, తిని ఫ్రూట్ పంచ్ లు తాగాం. మా పెద్ద ఆడపడచు అంటే మా పెద్దమామ గారి అమ్మాయి రిటైర్ అయ్యారని కేకు తీసుకుని వెళ్ళాం . దానిని ఆవిడ కట్ చేయగా మేము అందరం ముక్కలు చేసుకుని తిన్నాం ఆవిడ డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు కతిలీ తెచ్చారు. అవీ తిన్నాం.  అప్పుడు ఇంకో కాఫీ తాగి 11.00 గంటలకి వాళ్లు కుర్చీలు ఎత్తి టేబుల్స్ మీద పెట్టి క్లీనింగ్ సిధ్దం అవుతున్నారని గమనించుకొని కడుపు కన్నా మనసు నిండిపోయి ఉత్సాహంగా ఎవరి ఇళ్ళకి వారు చేరాం.
ఏంటీ మీకూ నోరు కన్నా మనసు ఊరుతుందా? మీ వాళ్ళు అందరిని పిలవండి. వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు. అది వాళ్ళ ప్రాబ్లమ్....చట్నీస్ లొ వర్కింగ్ డే అయితే చాలా సేపు కూర్చొనిస్తాడు...... Enjoy.....

Friday, August 24, 2018

మా పెళ్ళైన తరువాత మేము విజయనగరంలో వుండే వాళ్ళము. అప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ లో సత్యరావు అని ఒక ఆయన వుండేవాడు. వాళ్ళింట్లో తయారు చేసిన వినాయకుని బొమ్మ అని వినాయక చవితికి ఒక వినాయకుడి బొమ్మ తెచ్చి ఇచ్చారు. అతని చెయ్యి మహత్యము ఏమో కాని ఇంతవరకు ప్రతి వినాయకచవితికి ఒక వినాయకడు బొమ్మ ఎవరో ఒకరు గిఫ్ట్ గా ఇస్తూనే వున్నారు. ప్రతి వినాయక చవితి కి అతన్ని తలచుకుంటాము మేము..
నా "సుబ్రహ్మణ్యానికి"ఈ గణపతి అన్న.
పిల్లల్లో తో చేరి ఉన్న వినాయకులని తీసి తుడిచి బొట్లు పెట్టి,పూజ చేయడం సరదాగా మొదలై ఇప్పుడు ఆనవాయితి అయిపోయింది.
పెందరాడే పూజ చేసుకుని బయటకు వెళ్లాలని ఆయన హడావిడి,అంత హడావిడి పడలేక నేను ....దానికి తోడు" నా సుబ్రమణ్యం' చదువు కోసం అని దూరాన వుండడము, ఆ వినాయకులందరికి ఇప్పుడు తీయద్దు GHMC వాళ్ళు ఇచ్చిన "పర్యావణ గణపతి" తో పూజ చేసేసుకుందాం అనుకుంటే,మా అమ్మాయి ఒప్పుకోలేదు.
అన్ని వినాయకులని తుడిచి ,బొట్లు పెట్టి ఆదే అమర్చింది.
కింద ఫోటోలలో రెండు వినాయకుల మధ్య ఠీవిగా కూర్చున్న గణపయ్య ఈ సంవత్సరము మా గృహం పావనము చేసినది.
భక్తి లోపము లేదు,ఈ రోజు నైవేద్యము....
Vijayalakshmi Pothuri గారు చెప్పినట్టు అన్ని రకాలు చేద్దాము అనుకుని,
సొరకాయ పప్పు,బంగాళదుంప వేపుడు,ముక్కల పులుసు, టమాటో పచ్చడి,గోధుమపిండి హల్వా... ఉండ్రాళ్ళతో సరిపెట్టాము.వినయ్




Thursday, August 23, 2018

Thank you

Live by gratitude. It is the mantra for the life.
శుభోదయం...
జీవితములో ఎక్కువ తక్కువలు ఉంటూనే వుంటాయండి.

అది సృష్టి పరిణామ క్రమములో జరిగే మార్పుల లో నిన్న-నేడు-రేపు ,పగలు రాత్రి ఎలాగా సహజమో...ఇవాళ దుఃఖం ,రేపు ఆనందము కూడా సహజము.
ఇంతలో కంగారు పడి తల్లకిందులు అయిపోతే రేపటి ఆనందము అనుభవించొద్దు??
మరి ఇవాళ బాధ దాటేదెలా???
తెలుగు లో కృతజ్ఞత,ఇంగ్లీష్ లో థాంక్ యు,హిందీ లో షూక్రియా....నాకు ఇన్ని భాషలే వొచ్చు,😊

మన మది తలుపులు తెరిచి ప్రపంచాన్ని చూస్తే,లోకములో మనకన్నా కష్టాలు పడే వాళ్ళు బోలెడు మంది.

థాంక్ యు అనుకోండి.. వాళ్ళ కన్నా మనకు తక్కువ కష్టాలు ఉన్నందుకు. అంతే గాని, వాళ్ళ కష్టాలలో సుఖాన్ని వెతకి మీ కష్టాలు పెంచుకోకండి.

థాంక్ యు చెప్పుకోండి.

భగవంతుడికి,మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు...
మీ  పని వారికి....డైరెక్ట్ గా చెప్పకండి...వాళ్ళు కంగారు పడి పని మానేసి అవకాశం ఉంది. సో,మనసులో చెప్పుకోండి..😊😊

మీకు  జీవితము నేర్పిన ప్రతి పాఠానికి థాంక్స్ చెప్పండి. మనసు కి ప్రశాంతత వస్తుంది.జీవితము ఆనందమయము అవుతుంది.

Friday, July 13, 2018

రిలాక్స్

శుభోదయం..
వుంటారండి ఇలాగా కూడా...
వాళ్ళ గురించి నాలాంటి వారు చెప్పటానికి ఏమి ఉండదు..
ఎందుకంటే నేను ,నా మిత్ర బృందం అందరమూ "జరిగినా మన మంచికే, జరగకపోయినా మన మంచికే".అన్న బాపతు.ఈ విషయములో నాకు గురువు మా నాన్నగారు.
"మన తత్వం సత్-చిత్-ఆనందం". Then why create unhappiness?అంటారు మా నాన్న. అందుకని ఏమి జరిగినా,Relax!
ఇంకొక ఫ్రెండ్ వున్నారు. ఆమె ఇంట్లో పని వారు చెయ్యి వాటం చూపించారు. అది ఈవిడ గమనించారు. రిలాక్స్ అయ్యారు..ఎలాగో తెలుసా? "మన చేత్తో మనం చేస్తే దానము. వారి చేత్తో వాళ్ళే తీసుకుంటే దొంగతనం."
దీని prologue ఏమిటంటే,అసలు దానము చెయ్యటానికి "మనము ఎవరము? ఎవరి డబ్బు వుంటే వారే పట్టుకువెళ్తారు."
మరీ "వస్తా వట్టిదే,పోతా వట్టిదే"లాంటి తత్వవేత్తలము ఏమి కాదండోయ్. మేము నవ్వుతాము,ఏడుస్తాము...జన జీవన స్రవంతి లో కలుస్తాము...కానీ ఆ తరువాత scene లోంచి పక్కకు వెళ్లి మూడో వ్యక్తిగా చూస్తాము. అంతే పక్క వాడికి దెబ్బ తగిలితే మనకు నెప్పి పుట్టదుగా...అంతా నేను,నా,మేము,మన అన్న  భావన లొనే ఉంటుంది..
అందుకని......ఆలాగా...రిలాక్స్ అయిపోతాము..
మరి మీరు రిలాక్స్ అవడానికి ఏమి చేస్తారు?
Relax! The sky won't fall down.
Even if it is falling down, for its height you can run and hide before it falls.
If it happens to fall on you before you can run
IT IS DESTINY......ACCEPT IT AND RELAX.......

Sunday, June 24, 2018

Tears

శుభోదయం..
మరక మంచిదే లాగా.మనిషి అన్నాక అప్పుడప్పుడు ఏడుపు మంచిదేట...మన మనసు రిఫ్రెష్ అవుతుంది.
సంతోషం గా వున్నప్పుడు నవ్వు వచ్చినట్టు
దుఃఖం వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది...
సహజం...
లేని పోనీ బింకాలకు పోయి.....ఏడుపు దిగమింగి ....గుండె బరువు పెంచుకుని....ఆరోగ్యానికి చేటు తెచ్చుకోకండి....
నవ్వడం ఒక యోగం అయితే....
ఏడవడం ఒక భోగం....
ఎందుకంటే అందరూ అనుభవించలేరు.
 అదీ కాక  అంబికా దర్బార్ బత్తి కన్నా అది భగవంతుడికి దగ్గర మార్గం ఆట....
ఇంకేమి అన్ని ఆయనే చూసుకుంటాడు....

Tuesday, June 5, 2018

భయం

శుభోదయం
బలం-బలహీనత-భయం.
బలం అంటే మనకి ఉన్నది.....చెప్తారు కదా
మనిషి కి ఉన్నది బలం..
గొడ్డుకి తిన్నది బలం....

బలహీనత.  ...
మనకు మనము ఊహించి కల్పించుకున్నది..
నాకు లేదు,రాదు..
నా వల్ల కాదు...
నాకు చేత కాదు...
నేను చేయలేను...
నేను వుండలేను...
అబ్బో...చాలా కష్టం...
ఇవి అన్ని మనకు మనము కల్పించుకున్నవి....

ఒకసారి.' నేను' బదులు పక్క వాళ్ళని..
లేదా మూడు వ్యక్తి ని పెట్టండి...
అన్నీ తేలిక అవుతాయి..
ప్రశ్న మీదే...సమాధానము మీదే అవుతుంది..
బలహీనత -బలం అవుతుంది . ..
చేతకానితనం మనలో లేదు .
మన ఊహలో ఉంది...
ఒక్కసారి దాని అధిగమించారు అనుకోండి...
మీరే బలవంతులు....

భయం....
భయం కూడా మన ఊహలోనేగా...
"రజ్జు సర్ప భ్రాంతి"అన్నారు కదా.
వాస్తవం తెలిస్తే ఊహ లేదు...
భయం లేదు...బలహీనత లేదు....
అప్పుడు మనలని మించిన బలవంతులు లేరు....
నిజమే బలం...
బలమే నిజము....

Thursday, May 24, 2018

మమ్మగారింట్లో

మామ్మగారింట్లో...

ఎండాకాలం సెలవలు కి  మామ్మ వాళ్ళ ఊరు వెళ్తాము కదా...కనీసం ఆరుగురు మనవరాళ్లు ఒక మనవడు వుండేవాళ్ళము. అక్షరాల నలభై రోజులు సెలవలు.

వెళ్లిన రోజు సాయంత్రం గోరింటాకు పండగ జరిగేది.
 పద్మ అని ఇంటి  చాకలి అమ్మాయి కూతురు ఉండేది. మేము ఉన్నన్ని రోజులు మాతోనే ఉండి పోయేది. తను అప్పటికే గోరింటాకు సేకరించి రుబ్బి పెట్టేది.
దొడ్లో పచ్చ కనకంబరాలు కోసి కట్టి ఉంచేది.

గోరింటాకు ఎవరిదో బాగా పండిందో  వాదించేసుకుని అన్నాళ్ళు తిని పడుకునే వాళ్ళం.
పొద్దునే పక్షుల కిలకిలరావాల తో మెలకువ వచ్చేది.
అందరికన్నా ముందు లేచిన వారికి పాలు పోయించుకు వచ్చే అవకాశం దొరుకుతుంది.

మా మామ్మ కాఫీ ప్రాణి. రాత్రి వచ్చిన పాలు కాచి , కాఫీ ఫిల్టర్ వేసుకుని ఉంచుకునేది. ఆవిడకి ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు మొహం కడుక్కుని కాఫీ తాగేది.
పదమూడు ఏళ్లకే పెళ్లి అయిందట . మామ్మ వాళ్ళ నాన్నగారిది విజయవాడ. ఈవిడ బస్తి వాసి.
మా తాతయ్య  ది పల్లెటూరు .
మామ్మ కి నాజూగ్గా పొద్దునే కాఫీ అలవాటు.
అక్కడ అత్తారింట్లో పొద్దునే చద్దన్నం అలవాటు. అందుకని మా మామ్మ వాళ్ళ నాన్నగారు నెలవారీ కాఫీపొడి,పంచదార కొనిచ్చి,పాలకి డబ్బులు ఇచ్చేవారట...కూతురు కాఫీ లేక పోతే వుండలేదని.

విజయవాడ నించి వెళ్లిన మాకు ఆ గేదేల దగ్గరకు వెళ్తే పాలచెంబు తీసుకుని పాలు పిండి ఇస్తే ఆ నురగ తో భలేగా ఉండేది. అవి తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికి మా మామ్మ కుంపటి వెలిగించి-గ్యాస్ స్టవ్ వచ్చినా పాలు కాచటం ఆవిడ కుంపటి మీదే చేసేది. మా కోసం తెనాలి నించి తెప్పిచిన bournvita సీసా ,పంచదార డబ్బా ,వరసగా ఏడు గ్లాసులు దగ్గర పెట్టుకుని కూర్చునేది.

పిల్లలు ఒకరొకరు లేచి మొహం కడుక్కుని వచ్చి ఆ కుంపటి దగ్గర కూర్చుంటే bournvita కలిపి ఇచ్చేది. Bournvita తాగుతునప్పుడు మొదలు అవుతుంది. ఈ పూట పొద్దున్న ఏమి చేసుకుందాం అన్న డిస్కషన్.
అందరికన్నా చిన్నవాళ్ళ తో మొదలు, బొబ్బట్లు,బియ్యపు పరమాన్నం, కూరగాయలు వేసి ఉప్మా, గారెలు,పూరి-బంగాళా దుంపలు కూర, సేమియా పాయసం ఇలాగ లిస్ట్ ఉండేది.
రోజుకి ఒకటి చప్పున్న బ్రేక్ఫాస్ట్ కి ఆ ఐటమ్స్ చేసేది.
పొద్దునే అవి తినేసి
వరండాలో కూర్చుని ,ఆల్రెడీ చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు దాచిపెట్టిన చింతపిక్కలు తీసి ఆడుకునేవాళ్ళము.
పుంజి,కట్టు,గుర్రాళ్ళు,ఏనుగులు-గెలిచిన వారు నవ్వుతుంటే ఓడిన వాళ్ళు ఏడ్చే లోపు  పదకొండు గంటలకి లోపల నించి పిలుపు వచ్చేది

మా ఊరు నించి తెనాలి కి తాటిముంజేలు తీసుకునివెళ్తారు. వాళ్ళు బస్ ఎక్కేముందర మా ఇంటికి వచ్చి ముంజలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. వాటిని పదకొండు గంటల కి చిన్న నించి పెద్ద వాళ్లకు ఒక్కకరిని కూర్చోపెట్టి ఒక చిన్న ప్లేటు,గ్లాసు పెట్టేది.
 ముంజలు వలిచి నీరు గ్లాస్ లోకి ఒంపేది. వాళ్ళ కోట అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళు.అలాగ ఒక అరగంట పైనే అందరికి వలిచి పెట్టి మాకు మంచి పని అప్పచెప్పి తను వంట చేసేది..
ఇంతకు ఆ పని చెప్పలేదు కదా..
బియ్యము లో రాళ్లు ఉంటాయి కదా.అందరికి తలా ఒక ప్లేటు లో పోసి ఇచ్చి ఏరమనేది. ఎవరు ఎక్కువ ఏరితే వాళ్ళు గొప్ప..పిల్లల్ల మధ్యలో ఇంకా కావలసినది ఏముంది. మేము అల్లరి చేయకుండా ఈ పని చేసేవాళ్ళం తాను వంట చేసుకునేది.

మా తాతయ్య పొద్దున్న టిఫిన్ తినేసి ఊరిలో సెంటర్ దాకా ఒక రౌండ్ వెళ్లి ఇంటికి వచ్చి భోజనం టైం దాకా పడకుర్చీలో కునుకు తీసేవారు.
పిల్లలకి ఎండ దెబ్బ తగలకూడదు అని రగ్గులు వరండాలో అరేయించి వాటికి అరగా అరగా నీళ్లు కొడుతూ వుండేవాళ్ళము. లోపల వేపు ఎంత చల్లగా ఉండేదో...

మా మామ్మ వంట చాలా బాగా చేసేది...ముఖ్యముగా పప్పు పులుసు, గారెలు,ఆవడలు,వంకాయ కాల్చి పులుసు పచ్చడి  ఆవిడ పేటెంట్.

మధ్యాహ్నం భోజనాలు అయినాక కొంచెం కునుకు తీసేది...
తరువాత ఉండేది..జనరంజని. ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పట్లో ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్లమో....
మేము ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుతున్నాము కాబట్టి మన ఇంగ్లీష్ ప్రతిభా పాటవం చూపించాలి. Lkg లో Johny Johny నించి ఇంటర్మీడియట్ వరకు గుర్తే.
అందరమూ పాటలు పద్యాలు పాడి taperecorder రికార్డ్ చేసేవాళ్ళము.
ఇంక ఇంటికి వచ్చిన పక్కింటి వాళ్ళు,ఎదురింటి వాళ్లకి ఆ రికార్డ్ వినిపించేవాళ్ళం..





Wednesday, May 23, 2018

సంతోషం నాతోనే మొదలౌతుంది

సంతోషం నాతోనే మొదలు అవుతుంది....సంతోషం సగం బలం అన్నారు పెద్దలు..కాబట్టి సంతోషముగా ఉంటే మనకు ఎటువంటి పరిస్థితి అయినా చక్కదిడ్డుకోవడం చిటికెలో పని.
సంతోషం నాతోనే మొదలు అవుతుంది..
ఎందుకంటే నేను సంతోషంగా ఉంటేనే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది కాబట్టి...
కుటుంబం సంతోషంగా ఉంటే మనం వుండే చుట్టుపక్కల కూడా సంతోషముగా ఉంచగలిగిన అవకాశం మనకు ఉంటుంది కాబట్టి.
మన సంతోషానికి అయినా దుఃఖాన్నికి అయినా మనమే కారకులము అని నేను నమ్ముతాను. కుటంబములో చిన్న చిన్న సర్దుబాట్లు అప్పుడప్పుడు తప్పవు...చాలా సార్లు మనం అనుకున్నట్టు జరగదు.కానీ ఒక ఇల్లాలిగా ,తల్లిగా ఎదురుచూడని ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని అధిగమించటము తోనే మనకు ఆనందం దొరుకుతుంది.
నా వరకు నేను M.Phil చదువుకున్నా పిల్లళ్ళ కోసం ఇంట్లో వున్నాను. అలా అని వ్యాపాకం లేకుండా ఎప్పుడూ లేను. 
నా భర్తకు చేదోడు వాదోడుగా ఆఫీస్ అకౌంట్స్ చూస్తాను. 
వంట చెయ్యడం నాకు చాలా సరదా.రకరకాల వంటలు ప్రయత్నం చేస్తా.నా స్ట్రెస్ బస్టర్ కొత్త.వంట ప్రయత్నం చేయడం.
కేక్,biscuit బేకింగ్ అయితే చాలా బాగా చేస్తా. సాధారణంగా చాట్ ఐటమ్స్,స్వీట్స్ ,నార్త్ ఇండియన్ ఫుడ్ అంతా నేను ఇంట్లో నే చేసి పెడతా.
 మా పిల్లల చిన్నప్పటినించి చుట్టూ పక్కల పిల్లలతో చిన్న చిన్న నాటికలు వేయించేదాని. వేసవి కాలం సెలవలు వస్తే మా ఇల్లు ఒక ప్లే స్కూల్ లాగా ఉండేది.
పిల్లలకి మన సంస్కృతి సంప్రాదాయాలు తెలియాలి అన్న ఉద్దేశముతో ఎనిమిది సంవత్సరాలు కాలనీ లో ఆడపిల్లల కు ముగ్గులు,సంది గొబ్బెమ్మలు,పాటలు,కోలాటము,జానపద గీతాలు నేర్పించాను.
చదువుల పరంగా మా పిల్లలతో పాటు, అపార్ట్మెంట్ లో పిల్లల్ల  కూడా నాకు చేతనైన సాయం చేసాను. వాళ్ళకి వ్యాస రచన,క్విజ్ లాంటి పోటీలలో వివిధ ప్రోజెక్టుల లో సహాయం చేసేదాన్ని..
పిల్లల్లతో ఆడుతూ పాడుతూ,చదువుతూ,ఒక అమ్మ గా నేను చాలా సంతోషం పొందాను...వారిని చదివించడం నాకు ఒక revision లాగా ఉపయోగాపడి నేను" మీలో ఎవరు కోటీశ్వరడు"షో లో 6,40,000 గెల్చుకోవడానికి కారణం అయింది....
పిల్లలు పెద్ద అయినాక నా చుట్టూ వున్న సమాజానికి నేను సాయం చేయడానికి కూడా నేను సంతోషముగా ఉండడమే కారణం అని నేను నమ్ముతాను.
ఆ దారిలో అడపా దడపా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి...కానీ నా కుటుంబం సపోర్ట్, స్నేహితుల ప్రోత్సాహం,పెద్దల సలహాలు వలన నేను ఎంచుకున్న దారిలో నేను సంతోషముగా ఉండి,నా చుట్టు పక్క వారికి కూడా నా పరిధి లో నేను సంతోషపరిచే చెయ్యగలుగుతున్నా.
మనం వెళ్ళేదారి సంతోషంగా ప్రయాణం చేస్తే గమ్యం చేరడం సులువుగా ఉంటుంది..
ఎందుకంటే ప్రతి మజిలీ  మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది..
అంతులేని ఈ ప్రయణములో బహుదూరపు బాటసారులము మనము...సంతోషం ఒకటే మనకు దారి చూపే దివ్వెగా....
In Momspresso blog

Thursday, May 17, 2018

Amma nanna wedding anniversary 2018

అమ్మా నాన్న కు పెళ్లి రోజు శుభాకాంక్షలు.🙏🙏

మా అమ్మ కుందనపు బొమ్మ...

పదహారేళ్ళ పిల్ల- పెళ్ళిచూపుల్లో చిన్నపిల్లలాగా ఉంది వద్దు అనుకున్నారట నాన్న.
కూడా వెళ్లిన స్నేహితులు పిల్ల చక్కగా ఉంది చేసుకో అని సలహా  వలన ok.

మా నాన్న
సూపర్ హీరో...అప్పుడు...ఇప్పుడు...ఎప్పుడు...,,🕺
ఒక నిర్ణయానికి వచ్చాక ఎవరి మాట వినని సీతయ్య..
ఇంకేముంది....May15 1971 న పెళ్లి అయిపోయింది...

వాళ్ళ 47 వివాహ బంధంలో  నేను ఉన్నది 45 సంవత్సరాలు...
అమ్మ సంప్రదాయవాది.
నాన్న కు ఆలోచనల లో సంప్రదాయం.ఆచరణలో  రాడికల్.
ఆమె ధర్మం-ఆయన దానం.

ఆయన వేసిన ప్రతి ముందడుగులో బలం ఆవిడే...
ఆవిడ ప్రతి అడుగులో ఆలంబన ఆయన....

మాతృదేవోభవ 🙏   పితృదేవోభవ🙏
మా భగవద్గీత అమ్మ అయితే
మా కృష్ణ పరమాత్మ నాన్న...

నాకు మా చెల్లెళ్లా జీవనానికి దిక్సూచి,
అమ్మ నాన్న Be Happy & Stay blessed

శాఖోపశాఖలు

శుభోదయం.
నాకు చాలా బాధలు ఉన్నాయ్యి..నాకున్న అన్ని కష్టాలు ఇంకా ఎవరికి ఉండవు.. నేను కాబట్టి ఇలా వున్నాను కాను....అదే ఇంకా ఎవరైనా అయితేనా ........
హుష్... ఊరుకోండి... కష్టాలు ఎవరి పరిధిలో వారికి వుంటాయండి. ఎంత చెట్టు కి అంత గాలి...
ఎప్పుడైనా పక్కవాడు ఎంత బాగుపడ్డాడు, ఎంత లాభపడ్డాడు అని  కాక వాళ్ల జీవితాల్లో కి నిజముగా తొంగి చూస్తే తెలిస్తుంది.....
మనిషి మనిషి కి ఓ చరిత్ర.....
అప్పుడు అనుకోండి... భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఉన్న కష్టాలు మనకు లేవు కదా... అనిపిస్తుంది...
అవునులేండి.. వుంటారు కొంత మంది పక్క వారి కష్టాల్లో కూడా ఏదో  సుఖం చూసేవారు...తన సుఖం లో కూడా కష్టం కనపడుతుంది వారికి...
ఏది ఏమైనా కష్టాలు ఏ మనిషి కి అయినా కామన్ కాబట్టి... అవి వచ్చినప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోండి....
ఇంకా మీరు రెమ్మలు,కొమ్మలు గా పెరిగి,శాకపోశాఖాలుగా విస్తరించడం ఖాయం....

Wednesday, April 25, 2018

విశ్వనాధునికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సందర్భముగా

1980 లో శంకరాభరణం రిలీజ్ అప్పటికి 3rd క్లాస్ లో ఉన్నాను. విజయవాడ అప్సర థియేటర్ లో వచ్చిందట. మా ఇంటికి తీర్ధం తిరనాల్లే. ఊళ్ళ నించి జనం "శంకరాభరణం" సినిమా చూడటానికి వచ్చే వాళ్ళు. వాళ్ళకి టికెట్లు ఇప్పించి,మళ్ళీ చూడలనిపిస్తే ఒకసారి చూసేసి రావటం మా నాన్న వంతు. ఏ సినిమాకి అయినా ఇంటర్వెల్ ముందర మాత్రమే వచ్చే మా నాన్న ఒక్క "శంకరాభరణం " మాత్రం 23 సార్లు చూశారంటే.......మా ఇంట్లో ఆ సినిమా కు ఉన్న క్రేజ్ మీరు అర్ధం చేసుకోవచ్చు.
అతిధి మర్యాదలు మా  అమ్మ వంతు.
సినిమా చూసి వచ్చిన వాళ్ళు దాని గురించి డిస్కషన్సు. 

 మమ్మల్ని ఒకసారి సినిమాకు తీసుకు వెళ్లారు. అందులో శంకరాశాస్త్రి ని చూస్తే భయం వేసేది.
పైగా ఆ పాత్రలో మా అమ్మ కనిపించేది...మా అమ్మ ఇప్పటికి అంతే... ఏదైనా తేడా వస్తే "సహించదు,క్షమించదు".....కాకపోతే "శారదా" అనదు....."దుర్గమ్మా"అంటుందేమో అని భయం.
ఆ సినిమా కూడా అప్పుడు అర్థం అవలేదండి..తులసి పాత్ర మాత్రం బాగా నచ్చేది. అంతే........

స్వతహాగా మా అమ్మ బాగా పాడుతుంది..దానికి తోడు శంకరాభరణం చూశాక నాకు మా చెల్లి కి సంగీతం మాస్టర్ని ఇంటికి పిలిపించి నేర్పించడం మొదలు పెట్టింది. నాకేమో డాన్స్ ఇంట్రెస్ట్....... ఇష్టం లేకుండా కష్టపడి గీతాలు వరకు లాకొచ్చా....
మా చెల్లోమో చక చాక పాడేసేది...అది "శంకరాభరణం" లో రాజ్యలక్ష్మి టైప్......మా మాస్టర్ గారు ఒక శుభముహూర్తానా  మా అమ్మకి చెప్పేసారు.."ఈ అమ్మాయికి సంగీతం రాదు. డాన్స్ నేర్పంచండి"......మా అమ్మ నేను పొడగరిని కావడం వలన "నో"అనేసింది.. ...... 1984 విశ్వనాథ్ వారి "సాగర సంగమం"....కమల్ హాసన్ "వేదం..అణువు అణువున నాదం"అని మొదలు పెట్టగానే.  నాకు ఏడుపు ఆగలేదు.....అంతే థియేటర్ లోనే శోకాలు...."నేనూ డాన్స్ నేర్చుకుంటా"" మనసులో అయితే"బాలు"అంత డాన్సర్ అయినట్టే ఊహించుకున్నా ... మా బాబాయ్ హామీ ఇచ్చి ఇంటికి తీసుకు వచ్చాడు.... డాన్స్ నేర్చుకోలేదు కానీ "విశ్వనాథుగారి " సినిమాలు రుచి తెలిసింది..

"శృతిలయలు"లో సత్యనారాయణ "డబ్బులు లేవని అన్నము తినటం  మనేస్థామ్మా, ఇది అంతే"అని కళరాధన గురించి చెబితే...."మనకు ఉన్నదాంట్లో చేతనైనది"అనే మా నాన్న లాగా అనిపించారు.
"స్వర్ణ కమలం"ఫస్ట్ డే ఫస్ట్ షో...."సిరివెన్నెల".....మా అమ్మ ప్రత్యేకించి చూపించింది....."సూత్రధారులు".........ఇంకా విశ్వనాథ్ సినిమా అంటే ఇంట్లో చూసి వచ్చేదాకా పండగే....
మా అబ్బాయి టీనేజ్ కి రాగానే "స్వయంకృషి" చూపించా.
మా పిల్లల్లకి సమ్మర్ హాలిడేస్ స్పెషల్ విశ్వనాథ వారి సినిమాలు.

ప్రతి సంవత్సరం ఎదురు చూస్తా "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్"ఇస్తారేమో అని....ఇన్నాళ్టికి .....

"విశ్వనాథ గారి "గురించి చెప్పేటంతా సాహసం నేను చేయలేను కానీ......"శంకరాభరణం శంకర శాస్త్రి అయితే..."దొరుకున ఇటువంటి సేవ"........అని పాడితే...మీ సినిమాలు చూస్తూ, ఎంతో నేర్చుకుంటూ పెరిగిన తరం మేము...మీకు సహస్ర అభివందనములు...

Sunday, April 1, 2018

శుభోదయం
చిన్నప్పుడు చదువుకున్నాము కదా " ఐకమత్యమే బలము" అని,  నీతి పద్యాలు కూడా నేర్పేవారు పిల్లలకి... .చలి చీమల. ..గుర్తొచ్చిందా?????
ఇంకేంటి ఆండీ మరి.....మనం ఒక్కరము ఎంత బలవంతులము, శక్తిమాన్,సూపర్ మాన్,బాట్ మాన్ అయిన ఒకటి ఎప్పుడు ఒంటరి అంకె...1 పక్కన 0 పెట్టి చూడండి 10 -పది అయింది?మాకు తెలుసు ఈ లాజిక్, కానీ ఆ 0 ఒకటికి ఇటు వేపు ఉంటేనే అనే గా.....అప్పుడు మీరు  WHOLE NUMBERS లో ఉన్నారన్న మాట. లేదు మీరు వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారు....
మా వాళ్లు దూరముగా వున్నారు......ఇవ్వాళ రేపు కలిసి ఉండడానికి టెక్నిలజీ కరువు లేదు కాదా
అయినా నేను, నా వాళ్లే, అన్న పరిధి కొంచెం పెంచుకుని మన అనుకున్నాము అనుకోండి ఎక్కడ వుంటే అక్కడే మన చుట్టాలు.....అప్పుడూ బోలెడు సాధించవచ్చు..

పి.ఎస్..ఒంటరితనం ఆరోగ్యానికి హానికరం..

Thursday, March 29, 2018

కబుర్లు

మొన్న Lavanya Buddhavarapu బయటకి చెప్పారు,మిగతావాళ్ళు చెప్ప లేక పోవచ్చు,కానీ ఆడవాళ్ళు మాట్లాడితే కబుర్లు అని,ఎందుకు పనికి రానివని, అదేదో సామెత కూడా ఉంది కదా,"పగటి మాటలు పనికి చేటు,రాత్రి మాటలు నిద్రకు చేటు" అని. ఇలాంటివి అన్ని విని మన అందరమూ నిజమే కదా,ఆ టైం కాస్త మిగలితే ఇంకో పని చేసికోవాలి కానీ కాకమ్మ కబుర్లు ఎందుకు కూడు పెడతాయా?. గూడు కడతాయా?అని బోలెడు ఫీలింగ్స్ పెంచుకుంటాము. నా బోటి వాళ్ళు వచ్చి మాట్లాడించిన బోలెడు గిల్టీ ఫీల్ అవుతాం.
ఇప్పుడు పైగా అందరికి ఫిట్నెస్ ధ్యాస కూడా పెరగటం తో టైం వుంటే యోగ చేయాలి లేదాపరిగెత్తాలి అంతే కాని వేస్ట్ చేయరాదు.ప్రొడక్టీవ్, constructive use of time is very important. అందుచేత మాట్లేవ్,మాట్లాడుకోటాలు లెవ్. ఈ పరుగు పందాల బతుకుల్లో  ఆగితే గాలి పీల్చుకోగల టైం కూడా లేదు ఇంకా మాటలు కూడానా???
నేను M.A.Anthropology  చేస్తున్నప్పుడు ఒక చిన్న సర్వే గురించి చదివాను. ఒక గ్రామములో ప్రతిగి ఇంటికి ఒక పంచాయతీ పంపు పెట్టించారట. వాళ్ళ ఉద్దేశం ఆడవాళ్లు దూరం నుంచి నీళ్లు మోసుకు రాకుండా  తప్పుతుంది అని. పంచాయతీ వాళ్లు ఆ స్కీం ఎలాగా జరుగుతుందో అని చూడడానికి వెడితే ఎవరూ ఆ పంపులు వాడడంలేదుట. ఎందుకంటే, దూరముగా వెళ్ళేటప్పుడు వాళ్లు ఒకరికొకరు తోడు గా  కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ తిరిగి వచ్చేవారు. దీని వలన వారికి ఒక సోషల్ బాండింగ్ ఏర్పడి, ఒక విధమైన ఉత్సహం వచ్చేది. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి, ఎవరు ఇంట్లో నీళ్లు వాళ్లు పట్టుకోవడము లో వారికి ఆ సోషల్ బాండింగ్ లేక ఒంటరితనం గా అనిపించి, ఆ పంపులు  వాడడము మానేసి దూరం వెళ్లే నీళ్లు మోసుకొచ్చేవారట. అప్పటి నివేదిక ఏమిటంటే, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సోషల్ ఇంప్లికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని.కానీ ఇదే మాట మేము చెబితే కబుర్లు అని కొట్టిపరేస్తారు కదా. పైగా మన వాళ్ళ కన్నా బయట వాళ్ళు చెబితే చాలా నమ్మకంగా ఉంటుంది కదా. ఈ మధ్యనే ఒక వాట్సాప్ షేర్ వచ్చింది. Stanford University వారు నిర్మావహించిన సర్వే తేలింది ఏమిటంటే ఆడవారు మిగతా ఆడవారి తో కలిసి కాస్త కాలం గడపటం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది అని. వారి అమ్మ, అక్క చెల్లలు,మిగతా girl friends తో టైం గడపటం వలన వారిలోని సెరొటోనిన్ హార్మోన్ పెరిగి,వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని, ఎందుకంటే ఆడవారు వారి భావాలను పంచుకోగలగటం వలన  వారు మంచి support system maintain చేసుకోవటమే కాక బలమైన బంధాలను పెంచుకోవడము వలన జీవితములో రకరకాల సమస్యలను తేలిగ్గా అధిగమించిగలుగుతారట.
మనం సరదాగా సమయం గడపకపోతే అది ciggarette తాగినంత హానికారమట. కాకపోతే దాని గురించి చెబుతారు,దీని గురించి ఇంకా ఎవరూ చెప్పలేదు.
సో, next time మీరు టైం తీసుకుని  మీ ఫ్రెండ్స్ ని ,కుటుంబం లో మిగతా ఆడవారిని కలవటానికి వెళ్ళండి. అది మీ ఆరోగ్యానికి కాదు వారి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది.బిందాస్ గా కబుర్లు చెప్పుకోండి,ఆరోగ్యముగా ఉండండి.....

Tuesday, March 27, 2018

Joint family

సాధించే అత్తగారు/భరించే కోడళ్ళు-సాధించే కొడళ్ళు/భరించే అత్తగారు అప్పుడు వున్నారు-ఇప్పుడు వున్నారు.
అది ఒక మనిషి personality పైన ఆధారపడి ఉంటుంది.
షుమారు 45 సంవత్సరాల క్రితం కోడళ్ల తన కొడుకుని కాదాని  వెళ్ళిపోతే 2,4 సంవత్సరాల  మనవరాళ్లు అన్యాయం అయిపోతారని ఆరు నెలలు వెతికి తీసుకుని వచ్చి కొడుకు కుటుంబం ,కొడళ్ళు మనవరాళ్ల జీవితం నిలబెట్టినది ఒక అత్తగారు.

మొగుడు తాగుబోతు ఇల్లు పట్టించుకోకపోతే బంధు మిత్రులు ఎవరు  సపోర్ట్ కి రాకపోతే తన కొడుకుల్ని ఒంటి చేత్తో చదివించి ఆఫీసర్లని చేసింది ఒక తల్లి...మొగుడిని చుట్టాలని వదిలి పెట్టలేదు...

పెళ్లి అయిన కొత్తలో space ఇవ్వడం అనేది ముఖ్యం.
దానికి చాలా పరిమితులు ఉంటాయి
ఇంట్లో మనుషులు మనస్తత్వాలే కాక ఆర్థికం....అంతకన్నా ముఖ్యముగా  ఆ జంట ఒకరిని ఒకరు ఎంత అర్ధం చేసుకున్నారు అన్నది.

కలిసి ఉండాలి వద్దా అంటే???
చుట్టం చూపుగా వచ్చిన అత్తగారు జబ్బు పడితే మామగారి ఊరు వెళ్లి చూపించుకుంటాము అంటే వద్దు ఇక్కడే ఉండండి...నేనె చూసుకుంటా అని అన్ని సపర్యలు చేసిన కొడళ్ళు ఉన్నారు.
ఏ బంధంలో నైనా ఎప్పుడోఅప్పుడు కొంచెం friction రావడం సహజం.
దానిని అధిగమించి వెళ్ళాలి ....
అంతే కానీ దాని కోసం మన కుటుంబము నుంచి దూరం వెళ్తామా??
ఏ ఇద్దరి మధ్య అయినా మనసులు కలవడం ముఖ్యం
కలవలేదు అంటే తటస్థము గా ఉంటే సరిపోతుంది.
ముక్కుకు జలుబు చేస్తే ముక్కు కోసుకొముగా, మందు వేసుకుంటాం
జన్మ జలుబు అనుకోండి
hand kerchief ,inhaler పట్టుకుని తిరుగుతాం.
అలాగే మనిషి మనస్తత్వం తెలిసినప్పుడు మనం యదోచితముగా ఉండడమే...

But one thing is for sure....in any relation no one should force or coerce you.
అది accept చేసి మనం ఉన్నాము అంటే ఆ బంధానికి విలువే లేదు.....
అది ఎవరితో అయినా సరె....
మనసులు కలిసి వున్నప్పుడు...మనుషులు కలిసి వున్నారా లేదా అన్నది పెద్ద తేడా రాదు.
అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే సరిపోతుంది

2017 ugaadi

శుభోదయం.
ఉగాది వస్తోంది.చెట్లు మీది పండుటాకులు,ఎండుటాకులు రాలిపోయి కొత్త గా ఆకులు చిగురిస్తున్నాయి. మావిచిగురు, మామిడి చెట్టు పూత,పిందె,కాయ,పండు.
మన బంథాల లో -చుట్టాలు, ఆన్నదమ్ములు,అక్కచెల్లెల్లు,స్నేహితులు లాంటి ఎన్నో బంధాలు ఎండుటాకులు లాగా రాలిపోయి వుంటే (పాపం శమించుగాక)
మావిచిగురు సాక్షి గా చిగురింపచేసుకుందాము.
వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వారి వల్ల మనం చాలా నష్ట పోయం..సరే. వెళ్ళి వాటేసుకుని పెక్ (పెక్ అంటే తెలుసుకోవాలి అంటే మన్మధుడి సినిమా చూడండి)అవసరం లేదు. హల్లో హాయ్ ల తో మొదలు పెడదాం,చిగురు,పూత.పిందె స్థాయి దాటాక కొన్ని వగరు పిందెలు, పుల్లని మామిడి కాయలు కొన్ని,పండిన తియ్యని రసాలు కొన్ని గా మారాతాయి.
అవి ఏమి జరగలేదండి, మరి ఏమి ఫర్వాలేదండి కాలచక్రం లో ఎండుటాకులు రాలిపోతాయి, మళ్ళీ కొత్త చిగుర్ల కాలం..
మన ప్రయత్నం ఫలించక (మళ్ళి పాపం శమించుగాక) వేప పూత లాగా చేదు చిగురే మిగిలింది అనుకోండి.......ఉగాది పచ్చడికి వేప చేదులా జీవితంలోని షడ్రుచుల లో వేపపూతలా మిగతా రుచుల లో.కలపేద్దాం... ఏమంటారు... ఉగాది శుభాకాంక్షల తో

Thursday, March 22, 2018

Success

శుభోదయం
మనం చాలా సార్లు ఎవరైనా జీవితంలో స్ధిరపడ్డారు అంటే ఇల్లు కొన్నారా? కారు కొన్నారా? పిల్లలు ఇంజినీరా? డాక్టరా? అక్కడికి మీరు విజయవంతులా ..కాదండి
మీకు ఇల్లు వుంటే అపార్టమెంటా? ఇండిపెండెంటా? గేటెడ్ కమున్యిటా???
నెక్స్ట్ కొలమానం... కారు. దానిలో ని వివిధ స్థాయిలు దాటాలి
పిల్లల కెరీర్.....ఇంజనీరింగ్ అయితే IIT నా? NIT?కనీసం Universit లో నేనా??ఇంకా మిగతా వాటి parameters కూడా ఇలాగే..
మంచిదే ..అందరూ బాగా వుండాలి ..కాని అత్యుత్తమ స్ధాయిలో వుండాలి . అందరు పరుగులు పెడదాం.
60 మార్కులు వచ్చే పిల్లవాడు 70 మార్కులు తెచ్చుకుంటే గెలుపు పధమే.. 
కాని ఇప్పుడు కొలమానాలు అందరికి ఒకటే చేసి వారి స్ధాయీ బేధాలు ఆలోచించి కుండా అందరికి 100 మార్కులు తక్కువ రాకూడదు.95 మార్కులు కన్నా తక్కువ వచ్చిన వాడు వెధవ.. 60 మార్కులు వాడు 70 కొసం కృషి చేయకుండా 95 మార్కుల కోసం కాపీ కొట్టడం....
రూపాయి లేని రోజు నించి ఇవాళ పది రూపాయలు తెచ్చుకుంటున్నాం.. అది విజయం కాదు....100 రూపాయలు వుండాల్సిందే....దాని కోసం పరిగెత్తి ఏదో ఒకనాడు కూలబడదాం.
మనం జీవితం మొదలు పెట్టిన తొలి మెట్టు దగ్గర్నుంచి చేరిన  ప్రతి అంతస్తు దగ్గర  గమనించుకొని సంతృప్తి తో , విజయ గర్వం తో ఇంకో అంతస్తు ఎక్కే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎంత సాధించాము అన్నది తెలుస్తుంది.
సమాజ కొలమానాలు ఆహుతిలొ మనం సమిధ లు కావద్దు.
గబ్బర్ సింగ్ లాగా మనకి ఎవరికి వారికి ఒక తిక్క వుంటుంది, దాని లెక్క మనమే వేసుకుందాము.
అన్నింటి కన్నా ముఖ్యంగా మనిషి గా మనం ఎంత ఎదిగాం...ఎంత మంది స్నేహితులని సంపాదించుకున్నాం...కనీసం ఆ నలుగురు అన్నా మన కోసం వున్నారా....అది గుర్తిద్దాం
ఏమంటారు ఫ్రెండ్స్.......

Sunday, March 11, 2018

ధైర్యం

శుభోదయం.
భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడు కి చెప్పిన మొట్టమొదటి మాట ఇది అని మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. మనకు ఉండవలసిన మొట్టమొదటి సంపద ధైర్యం....
వుండకూడని మొట్టమొదటి బలహీనత భయం...
మిన్ను విరిగి మీద పడుతుందమొనని ఆలోచించి ముందే. కంగారుపడి కంగారు లాగా గంతులు పెట్టకండి.
ముందు జాగ్రత మంచిదే... కాని అతి జాగ్రత్త అనవసరం....
ధైర్యం గా వుండండి.... ఏదైనా జరిగే ముందు మనం ఊహించిన, అనుభవించిన భయం , అది జరిగాక ఆలోచిస్తే -అరే దీనికే భయపడ్డామ? అనిపిస్తుంది.
చాలా సార్లు " రజ్జు సర్ప భ్రాంతి" లాగానే గడిచి పోతుంది.....All is well.....  ఏమి కాదు..... అంతా మన మంచికే....