Wednesday, December 13, 2017

మామ్మగారి ఊరు ప్రయాణం

ధనుర్మాసం, నెల పడుతున్నారు అంటే కొంత మందికి ఒక రకమైన హడావిడి.
మేము చదువుకున్న స్కూల్ మిషనరీ స్కూల్ కావడం తో మాకు  క్రిస్మస్ కి వారం ముందు సెలవలు మొదలై,సంక్రాంతి వరకు సాగేవి.
దాని తో ...చలో మామ్మాగారి ఊరు.
ఆరునెలల ఆఖరు పరీక్ష వ్రాసి ,మధ్యాహ్నం స్కూల్ నించి రాగానే...అన్నం తినేసి..ఎవరోఒకరు మమ్మల్ని ఊరికి తీసుకు వెళ్ళడానికి సిద్ధముగా ఉండేవాళ్ళు..
విజయవాడ నించి తెనాలి వెళ్లి,అక్కడ నించి పంతొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే,మా మామ్మగారి ఊరు...పెరవలి..
తెనాలి -రేపల్లె రూట్లో,భట్టిప్రోలు వెళ్లే బస్ ఎక్కితే వస్తుంది.
ఇప్పుడు ఫ్లైట్ లో తిరుగుతున్నాము అన్న పేరే కానీ..
ఆ ప్రయాణం మాజానే వేరు.
విజయవాడ నించి తెనాలి వరకు నాన్ స్టాప్ దొరికితే ఒక రకం..
అదే ఏ పాసెంజర్ అంటే ఇప్పటి పల్లె వెలుగు లాంటిది దొరికిందో......మంగళగిరి ,రేవేంద్రపాడు,నందివెలుగు లాంటి బస్టాండుల్లో ఆగి,జనాన్ని ఎక్కించుకుని...పండుగల టైం లో అయితే కుక్కించుకొని...తీసుకువెళ్ళేవాడు..
ఇంక తెనాలి లో దిగి అక్కడినించి భట్టిప్రోలు వెళ్లే బస్ ఎక్కాలి..
ముందు ఒక అరగంట బస్ కోసం ఎదురుచూడాలి..
ఒక్కోసారి మన ముందునుంచే బస్ వెళుతుంది...అది మళ్ళీ తిరిగి రావాలి..
బస్ ప్లాట్ఫారం మీద ఆగంగానే సన్నగా ఉన్నవాళ్లు,లేక పోతే చిన్న పిల్లలలో ముందు గుంపులోంచి దూరిపోయి
బస్ ఎక్కేసి,కర్చీఫులు,తువ్వాలు వేసి వెనకాల ఎక్కేవాళ్ళ కోసం సీట్ పెట్టాలి...అక్కడే మన నెగ్గుకు వచ్చే తత్వం నేర్చుకుంటాము.
ఇంత చేస్తే ఆ బస్  నిండుగర్భిణి లాగా నడక మొదలుపెట్టి...దారిలో వచ్చే గేదెలు,ఆవులను తప్పించుకుని పెరవలి పాలెం వస్తే ఒక ఆనందం,...
ఇంక గంగోలు....అది కాలవ అన్న  సంగతి మాకు డిగ్రీలకు వచ్చేదాకా తెలియదు....
మాకు అది పెద్ద గంగా నది.
ఆ గంగోలు చూడగానే మాకు మొహాలు వికసిస్తాయి....
పెరవలి సెంటర్ స్టాప్....అది దాటగానే సత్రం స్టాప్...పెరవలి ఆఫీషల్ బస్టాండ్..
దాన్ని అనుకునే మా మామ్మగారి ఇల్లు....
బస్ దిగంగానే తాతయ్య నుంచునివుండేవారు.
లోపలకి అడుగు పెట్టగానే మామ్మా గుమ్మములో ......
విజయవాడ నించి గట్టిగా 50 km ల ప్రయాణం....
ఇదంతా ఎనభైలలో సంగతి....
కానీ అదో పెద్ద జ్ఞాపకము....
కూడా వచ్చిన వాళ్లు,తీసుకు వెళ్ళడానికి వచ్చే అమ్మ వాళ్ళు అదో పెద్ద పని,రెండు బస్సులు మారి వెళ్ళాలి అనుకోలేదు..
కారులో వెళ్లాలన్నా ఇవ్వాళ పిల్లలకు కాలు కదపాలి అంటే
...సో...బోరింగ్....
సెలవలు అంటే.....
రిసార్ట్స్,destination ట్రావెల్లింగ్....
అయితే చేతులు కలిస్తే చప్పట్లు....

మా మామ్మా  "పండగ- అందరూ ఊరికి రావాలి"-ముఖ్యముగా సంక్రాంతి,దీపావళి,క్రిస్మస్ మరియు వేసవి సెలవులు..పిల్లల్ని పంపండి....అని ఉత్తరం..తరువాత ఫోను చేసేది...మా అమ్మవాళ్ళు కూడా పంపేవాళ్ళు...
వెళ్లిన పిల్లలు అతుక్కుపోయేవారు....

ఇంటికి వెళ్ళాక సెలవుల మాజా ఇంకొక పోస్టులో......

Sunday, November 12, 2017

ఆహారవీధిలో

ఆహార వీధి
కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి.
అది ఒక పెద్ద ఆహార వీధి.  It is called a dining street .అంటే మన ఇంట్లో హాల్లో డైనింగ్ టేబుల్ వేస్తాము కదా అలాగా ఒక వీధి అంతా  డైనింగ్ టేబుల్ అన్న మాట. ఆ వీధిలో ఉన్న ఇళ్లల్లో ఒక ఇల్లు ఆవకాయ ఇల్లు,ఒక ఇల్లేమో మెంతికాయ ఇల్లు,ఒక ఇల్లు కందిపొడి నిలయం, ఆ ఇంటి పంపులోంచి నెయ్యి ,నూనెలు వస్తాయి అన్న మాట. పండుమిరప్పల కారానికి ఒక ఇల్లు, గోంగూర గారి బంగ్లా ఒకటి. చింతకాయ,నిమ్మకాయ,ఉసిరికాయ అక్క చెల్లెలు. ఒకే ఇంట్లో ఉంటాయి అన్న మాట.
అంటే మనం  జాడిలో  పచ్చడి పెట్టుకుంటాము కదా…. అలాగా  డైనింగ్ స్ట్రీట్ అంత టేబుల్ కోసం ఇల్లంత జాడీలు ఆన్నమాట.
 ఇంకొక ఇంటి పేరు పచ్చిపులుసు నివాస్. ఒక ఇల్లు పనసపొట్టు కూర,
మరి ఇంటి అలమరలు ,బీరువాల్లో ఏముంటాయో తెలుసా….. అరిసెలు,కజ్జికాయలు,బొబ్బట్లు,సున్నిఉండలు…
భోషాణాలలో కారపూస,చెక్కలు,వెన్నఉండళ్లు,జంతికలు,కారపు బూందీ ఉంటాయి అన్నమాట.
ఇవి తినేవారు ఎవరంటే….…నీకు ఉన్న పద్నాలుగు మంది పిల్లలు,వారి పిల్లలు,ఇంకా వాళ్ళకి పిల్లలు పుడితే - కౌరవ సంతానానికి ఈ మాత్రము ఏర్పాటు లేక పోతే ఎలా??? అని చిన్నప్పుడు మా మామయ్య మా అమ్మని ఏడిపించేవాడు…
………..
“ఊహించుకుంటేనే ఎంత బావుంది తాత,”అన్నాడు నా మనుమడు…
“నిజమే,కానీ జరుగుతున్నది ఏమిటి?”
మీ ఇంట్లో ఉన్న 6 సీటర్ dining table మీద కనీసం నెలకి ఒకసారి అన్నా అంత మంది కూర్చుని తింటున్నారా?”  అడిగాడు తాత.
“ఎలాగా? మేము ఉన్నదే నలుగురం కదా”అన్నాడు మనుమడు…
“మరి నువ్వు నీ తమ్ముడు పెద్ద అయి వెళ్లిపోయారు అనుకో అప్పుడు రెండు కుర్చీలు చాలుగా?”అన్నాడు తాత
“సెలవులు కు వస్తాముగా,అన్నాడు మనుమడు
“కుదరకపోతే”??సందేహం తాతది.
“కుదుర్చుకుంటాం” నమ్మకం మనవడి ది.
“అలాగే జరిగి వుంటే , మా పద్నాలుగు మంది అక్క చెల్లలు ,వాళ్ళ సంతానము,సంతానాన్ని సంతానము కలిస్తే  కావలసింది ఆహార వీధేగా??
మరి  ఎక్కడ ఆగిందో ఆలోచించు,”
“కలుపుదాం, ఆహార వీధిలో విహరిద్దాం “అంటూ భరోసా ఇచ్చాడు మనవడు…
తృప్తిగా నవ్వాడు తాత….

Saturday, November 11, 2017

sriharshasowmya: Jonnalagaddavari palem

sriharshasowmya: Jonnalagaddavari palem: చెరుకుపల్లి ,కావురు దగ్గర జొన్నలగడ్డవారి పాలెం అని ఒక ఊరు.. ఆ ఊరు మా ఇంటి పేరు మీదే ఉంటుందన్న మాట... జొన్నలగడ్డ సత్యనారాయణ గారు మా వారి త...

కబుర్లు

 ఆడవాళ్ళు మాట్లాడితే కబుర్లు అని,ఎందుకు పనికి రానివని, అదేదో సామెత కూడా ఉంది కదా,"పగటి మాటలు పనికి చేటు,రాత్రి మాటలు నిద్రకు చేటు" అని. ఇలాంటివి అన్ని విని మన అందరమూ నిజమే కదా,ఆ టైం కాస్త మిగలితే ఇంకో పని చేసికోవాలి కానీ కాకమ్మ కబుర్లు ఎందుకు కూడు పెడతాయా?. గూడు కడతాయా?అని బోలెడు ఫీలింగ్స్ పెంచుకుంటాము. నా బోటి వాళ్ళు వచ్చి మాట్లాడించిన బోలెడు గిల్టీ ఫీల్ అవుతాం.
ఇప్పుడు పైగా అందరికి ఫిట్నెస్ ధ్యాస కూడా పెరగటం తో టైం వుంటే యోగ చేయాలి లేదాపరిగెత్తాలి అంతే కాని వేస్ట్ చేయరాదు.ప్రొడక్టీవ్, constructive use of time is very important. అందుచేత మాట్లేవ్,మాట్లాడుకోటాలు లెవ్. ఈ పరుగు పందాల బతుకుల్లో  ఆగితే గాలి పీల్చుకోగల టైం కూడా లేదు ఇంకా మాటలు కూడానా???
నేను M.A.Anthropology  చేస్తున్నప్పుడు ఒక చిన్న సర్వే గురించి చదివాను. ఒక గ్రామములో ప్రతిగి ఇంటికి ఒక పంచాయతీ పంపు పెట్టించారట. వాళ్ళ ఉద్దేశం ఆడవాళ్లు దూరం నుంచి నీళ్లు మోసుకు రాకుండా  తప్పుతుంది అని. పంచాయతీ వాళ్లు ఆ స్కీం ఎలాగా జరుగుతుందో అని చూడడానికి వెడితే ఎవరూ ఆ పంపులు వాడడంలేదుట. ఎందుకంటే, దూరముగా వెళ్ళేటప్పుడు వాళ్లు ఒకరికొకరు తోడు గా  కబుర్లు చెప్పుకుంటూ వెళ్లి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ తిరిగి వచ్చేవారు. దీని వలన వారికి ఒక సోషల్ బాండింగ్ ఏర్పడి, ఒక విధమైన ఉత్సహం వచ్చేది. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి, ఎవరు ఇంట్లో నీళ్లు వాళ్లు పట్టుకోవడము లో వారికి ఆ సోషల్ బాండింగ్ లేక ఒంటరితనం గా అనిపించి, ఆ పంపులు  వాడడము మానేసి దూరం వెళ్లే నీళ్లు మోసుకొచ్చేవారట. అప్పటి నివేదిక ఏమిటంటే, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు సోషల్ ఇంప్లికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని.కానీ ఇదే మాట మేము చెబితే కబుర్లు అని కొట్టిపరేస్తారు కదా. పైగా మన వాళ్ళ కన్నా బయట వాళ్ళు చెబితే చాలా నమ్మకంగా ఉంటుంది కదా. ఈ మధ్యనే ఒక వాట్సాప్ షేర్ వచ్చింది. Stanford University వారు నిర్మావహించిన సర్వే తేలింది ఏమిటంటే ఆడవారు మిగతా ఆడవారి తో కలిసి కాస్త కాలం గడపటం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది అని. వారి అమ్మ, అక్క చెల్లలు,మిగతా girl friends తో టైం గడపటం వలన వారిలోని సెరొటోనిన్ హార్మోన్ పెరిగి,వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని, ఎందుకంటే ఆడవారు వారి భావాలను పంచుకోగలగటం వలన  వారు మంచి support system maintain చేసుకోవటమే కాక బలమైన బంధాలను పెంచుకోవడము వలన జీవితములో రకరకాల సమస్యలను తేలిగ్గా అధిగమించిగలుగుతారట.
మనం సరదాగా సమయం గడపకపోతే అది ciggarette తాగినంత హానికారమట. కాకపోతే దాని గురించి చెబుతారు,దీని గురించి ఇంకా ఎవరూ చెప్పలేదు.
సో, next time మీరు టైం తీసుకుని  మీ ఫ్రెండ్స్ ని ,కుటుంబం లో మిగతా ఆడవారిని కలవటానికి వెళ్ళండి. అది మీ ఆరోగ్యానికి కాదు వారి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది.బిందాస్ గా కబుర్లు చెప్పుకోండి,ఆరోగ్యముగా ఉండండి.....

Wednesday, October 25, 2017

Jonnalagadda vari palem

చెరుకుపల్లి ,కావురు దగ్గర జొన్నలగడ్డవారి పాలెం అని ఒక ఊరు.. ఆ ఊరు మా ఇంటి పేరు మీదే ఉంటుందన్న మాట...

జొన్నలగడ్డ సత్యనారాయణ గారు మా వారి తాతగారు.పితామహులు.
వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణ గారు..
జొన్నలగడ్డ సత్యనారాయణ గారు స్వతంత్ర సమరయోధులు...తామ్రపత్ర గ్రహీతలు.

ఈ దంపతులిద్దరి జ్ఞాపకార్థం వీరి పిల్లలైన
శ్రీమతి&శ్రీ Dattatreyulu Jonnalagaddaగారు
శ్రీమతి &శ్రీ.అనంతరామయ్య గారు
శ్రీమతి &శ్రీ శ్రీహరిగారు
శ్రీమతి &శ్రీ Kishore Jonnalagaddaగారు
శ్రీమతి&శ్రీ నారుమంచి శివప్రసాద్ గారు (కుమార్తె-అల్లుడు)
శ్రీమతి&శ్రీ చావాలి రాధాకృష్ణ గారు(కుమార్తె-అల్లుడు)
చే....

వీరి పిల్లలు,అంటే జొన్నలగడ్డ సత్యనారాయణ -అన్నపూర్ణల గారి మనవళ్లు,మనవరాళ్లు కలిసి
 జొన్నలగడ్డవారి పాలెం లో ఉన్న ప్రైమరీ స్కూల్ కి బీరువా,అక్కడ చదువుతున్న పిల్లల్లకు స్కూల్ డ్రెస్సెస్, టై,బెల్ట్,బ్యాడ్జిలు,షూస్,కథల పుస్తకాలు,ఆట వస్తువులు,పెన్సిల్స్,పెన్సిల్ బాక్స్లు ఇలాంటివి పంచటం జరిగింది.
2017 మే లో మాకు ఈ ఆలోచన వచ్చింది...అందరమూ కలిసి సమాలోచన చేసి....ఎందుకంటే తాతగారు అక్కడ స్కూల్ టీచర్ గా వున్నారు..అది కాక social గా ఆయన చాలా active.. అందుకని ముందుగా స్కూల్ నించి మొదలు పెడదామని తొలి అడుగు వేసాము.

మా బావగార్లు శ్రీ Jonnalagadda Rajendra, Ravisankar Jonnalagadda మరియు Jonnalagadda Sudhakar  గార్లు సెప్టెంబర్ లో ఢిల్లీ నించి విజయవాడ వచ్చినప్పుడు ముందుగా ఆ ఊరు వెళ్లి స్కూల్ హెడ్మాస్టర్ ని కలిసి అక్కడ వారి అవసరాలు స్వయముగా లిస్ట్ రాసుకుని హైదరాబాద్ లో ఉన్న మాకు ఇచ్చారు.

అక్కడ నించి హైదరాబాద్ లో మా వారు శ్రీ Sridhar Jonnalagadda గారు , మా ఆడపడుచులు శ్రీమతి Srilakshmi Jonnalagadda గారు ,  Srilatha Sreelatha Jonnalagadda ,మా పినమామగారు  శ్రీ కిషోర్ గారు ఒక టీం లాగా అన్ని సమకూర్చుకుని-
మా మామగారి అన్నదమ్ములని,అక్కచెల్లెల్లని తీసుకుని పాలెం వెళ్లి ఆ పిల్లల్లకు ఆ వస్తువులు అందచేశారు.

ఇది అంతా తొలి ప్రయత్నమే. ఉడుత సాయం అని నాకు తెలుసు..కానీ ఎందుకు రాస్తున్నానంటే......
ఆ ఊరికి వెళ్లడానికి ఆ పెద్దవాళ్లు చూపిన ఉత్సాహం చూడాలి..
వెళ్లి అక్కడ ఒక పూట గడపగానే వారి ఆనందం వర్ణనాతీతం.
ఆ పిల్లలు ఎంత పొందికగా ఉన్నారో...
ఆ హెడ్మాస్టర్ గారు కూడా సభ బాగా నిర్వహించారు.
మా పెద్దవాళ్లు మా అందరి తరఫున వారికి వాగ్దానం చేశారు.....
ఎటువంటి అవసరం వున్నా వాళ్ళకి తెలియచేస్తే అది సమకూరుస్తాము అని.
ప్రైవేట్ బడులలో చదువుకొనే పిల్లల్ల కన్నా , గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించాలి..అందుకు తగిన వాతావరణం అక్కడ కల్పించాలి అని మా ఆశ.

మంచి పని చేసినప్పుడు చెప్తే, ఇంకొకరి ఇటువంటి ఆలోచన వస్తే ,వారు ఏదైనా చెయ్యడానికి ఆలోచన కలుగుతుందేమో అన్న ఉద్దేశం తప్ప..గొప్పగా చెప్పుకునే తాపత్రయం కాదు......గమనింప ప్రార్థన.















Jonnalagaddavari palem

చెరుకుపల్లి ,కావురు దగ్గర జొన్నలగడ్డవారి పాలెం అని ఒక ఊరు.. ఆ ఊరు మా ఇంటి పేరు మీదే ఉంటుందన్న మాట...

జొన్నలగడ్డ సత్యనారాయణ గారు మా వారి తాతగారు.పితామహులు.
వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణ గారు..
జొన్నలగడ్డ సత్యనారాయణ గారు స్వతంత్ర సమరయోధులు...తామ్రపత్ర గ్రహీతలు.

ఈ దంపతులిద్దరి జ్ఞాపకార్థం వీరి పిల్లలైన
శ్రీమతి&శ్రీ Dattatreyulu Jonnalagaddaగారు
శ్రీమతి &శ్రీ.అనంతరామయ్య గారు
శ్రీమతి &శ్రీ శ్రీహరిగారు
శ్రీమతి &శ్రీ Kishore Jonnalagaddaగారు
శ్రీమతి&శ్రీ నారుమంచి శివప్రసాద్ గారు (కుమార్తె-అల్లుడు)
శ్రీమతి&శ్రీ చావాలి రాధాకృష్ణ గారు(కుమార్తె-అల్లుడు)
చే....

వీరి పిల్లలు,అంటే జొన్నలగడ్డ సత్యనారాయణ -అన్నపూర్ణల గారి మనవళ్లు,మనవరాళ్లు కలిసి
 జొన్నలగడ్డవారి పాలెం లో ఉన్న ప్రైమరీ స్కూల్ కి బీరువా,అక్కడ చదువుతున్న పిల్లల్లకు స్కూల్ డ్రెస్సెస్, టై,బెల్ట్,బ్యాడ్జిలు,షూస్,కథల పుస్తకాలు,ఆట వస్తువులు,పెన్సిల్స్,పెన్సిల్ బాక్స్లు ఇలాంటివి పంచటం జరిగింది.
2017 మే లో మాకు ఈ ఆలోచన వచ్చింది...అందరమూ కలిసి సమాలోచన చేసి....ఎందుకంటే తాతగారు అక్కడ స్కూల్ టీచర్ గా వున్నారు..అది కాక social గా ఆయన చాలా active.. అందుకని ముందుగా స్కూల్ నించి మొదలు పెడదామని తొలి అడుగు వేసాము.

మా బావగార్లు శ్రీ Jonnalagadda Rajendra, Ravisankar Jonnalagadda మరియు Jonnalagadda Sudhakar  గార్లు సెప్టెంబర్ లో ఢిల్లీ నించి విజయవాడ వచ్చినప్పుడు ముందుగా ఆ ఊరు వెళ్లి స్కూల్ హెడ్మాస్టర్ ని కలిసి అక్కడ వారి అవసరాలు స్వయముగా లిస్ట్ రాసుకుని హైదరాబాద్ లో ఉన్న మాకు ఇచ్చారు.

అక్కడ నించి హైదరాబాద్ లో మా వారు శ్రీ Sridhar Jonnalagadda గారు , మా ఆడపడుచులు శ్రీమతి Srilakshmi Jonnalagadda గారు ,  Srilatha Sreelatha Jonnalagadda ,మా పినమామగారు  శ్రీ కిషోర్ గారు ఒక టీం లాగా అన్ని సమకూర్చుకుని-
మా మామగారి అన్నదమ్ములని,అక్కచెల్లెల్లని తీసుకుని పాలెం వెళ్లి ఆ పిల్లల్లకు ఆ వస్తువులు అందచేశారు.

ఇది అంతా తొలి ప్రయత్నమే. ఉడుత సాయం అని నాకు తెలుసు..కానీ ఎందుకు రాస్తున్నానంటే......
ఆ ఊరికి వెళ్లడానికి ఆ పెద్దవాళ్లు చూపిన ఉత్సాహం చూడాలి..
వెళ్లి అక్కడ ఒక పూట గడపగానే వారి ఆనందం వర్ణనాతీతం.
ఆ పిల్లలు ఎంత పొందికగా ఉన్నారో...
ఆ హెడ్మాస్టర్ గారు కూడా సభ బాగా నిర్వహించారు.
మా పెద్దవాళ్లు మా అందరి తరఫున వారికి వాగ్దానం చేశారు.....
ఎటువంటి అవసరం వున్నా వాళ్ళకి తెలియచేస్తే అది సమకూరుస్తాము అని.
ప్రైవేట్ బడులలో చదువుకొనే పిల్లల్ల కన్నా , గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించాలి..అందుకు తగిన వాతావరణం అక్కడ కల్పించాలి అని మా ఆశ.

మంచి పని చేసినప్పుడు చెప్తే, ఇంకొకరి ఇటువంటి ఆలోచన వస్తే ,వారు ఏదైనా చెయ్యడానికి ఆలోచన కలుగుతుందేమో అన్న ఉద్దేశం తప్ప..గొప్పగా చెప్పుకునే తాపత్రయం కాదు......గమనింప ప్రార్థన.

Monday, October 23, 2017

Sri Lalitha Mahila Mandali 25th Anniversary

October 11న మా శ్రీ లలితా మహిళ మండలి 25వ వార్షికోత్సవం జరిగింది.
మహిళ మండలి అనగానే-కేవలం కాలక్షేపం కబుర్లు అనుకునే వాళ్ళకి -
ఈ మహిళ మండలి లో ఉన్న సభ్యుల గురించి వింటే.....సామాన్యులుగా కనిపించే వీరు ఎంత అసామాన్యులు అనిపించక మానదు.

మనిషి మనిషి కి  ఒక చరిత్ర......
ఒక సమస్య- దాని పరిష్కారం.
ఒక సందర్భం-దాని సర్దుబాటు...
ఇందులో చాలా మంది సభ్యులు సీనియర్ సిటిజన్స్....
జీవితపు ఆటుపోట్లు అనుభవించిన వారే....
కన్యాశుల్కం లో గిరీశం "నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్"అంటాడు కదా ఆలాగా..
వీరితో వుండటమే నాకు బోలెడు వారి అనుభావాల పాఠాలు...

ముఖ్యముగా చెప్పవలసిన వారు...
Smt. Subba Lakshmi G గారి గురించి...ఈవిడను నేను పరిచయం చేయఖ్ఖర్లేదు.. ఈమె మా FounderPresident... 25 సంవత్సరాల నుంచి ఒక  మహిళ మండలి  నడపడం....ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నది సామాన్యమైన విషయము కాదు.
ఈమె స్వయముగా సృజనాత్మక రచయిత్రి అవడమే కాక ,మిగతా సభ్యుల లోని సృజనాత్మకత ను వెలికి తీయడములో నిష్ణాతులు...

ఈ మండలి లో  నాకు ముఖ్యులు
Smt. U. Rajyalakshmi గారు. -Treasurer. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకు వుంటునప్పటి నించి నన్ను ఈ మండలి కి పరిచయం చేయడమే కాదు.....She is my friend ,guide philosopher,mentor......

Smt. Bharati Prakash గారు -మా సెక్రటరీ....అక్కకు చేదోడు గా....."నేను ఎప్పుడు మా చిన్నక్క తోనే" అంటూ..

ఈ 25వ వార్షికోత్సవం నాడు AIR శారదా శ్రీనివాసన్ గారు మా చీఫ్ గెస్ట్ గా రావడం.వారిని  కలవడం ఎంతో ఆనందానిచ్చింది.

మరొక మధురస్మృతి......Smt.Pothuri Vijayalakshmi Pothuriగారి తో స్కిట్ చెయ్యడం...... ఆవిడ అప్పటికప్పుడు అక్కడ ప్లాన్ చేసి స్కిట్ వేశారు... అందులో రెండే పాత్రలు...ఒకటి ఆవిడ వేశారు......రెండు నేను......
అక్షర సరస్వతి,నవ్వుల రాణి........ఆవిడ తో స్కిట్ అంటే....నాకు ఎంతటి ఆనందము...😊😊
ఆ రోజు ఆవిడ మా ఆత్మీయ అతిధి. ఎంత నవ్విస్తారో....అంత బాగా మాట్లాడతారు.

మా Sundari Vedula గారు.......ఈవిడ సోది చెప్పే అమ్మాయి వేషం వేసి......మా అందరి మనసులు నిండేలా ఎంత బాగా సోది చెప్పారంటే......ఆవిడ energy కి,ఉత్సాహనికి hatsoff....God bless you aunty.

ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయండి......
పొద్దున 11 గంటలు నించి సాయంత్రము 4 గంటల వరకు ఒక పండుగ వాతవరణము.
నాకయితే ఈ మహిళ మండలి మీటింగ్ కి వెళ్తే  ఉత్సాహమూ, మోటివేషన్ వస్తుంది.
అది కాక,నాకు బోనస్ గా వాళ్ళందరి మాతృవాత్సల్యం........
శ్రీ లలితా మహిళ మండలి జిందాబాద్........
జై హో..















Thursday, September 28, 2017

Jagadish గారి నోట రాముడి మాట

పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు.

అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు.

అందరాని చందమామకోసం అలకలుపోయావు.
కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు.

బాగా చిన్నప్పుడే ఆస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు.

ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు.

ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభని ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు.

తీరా పెళ్ళయ్యీ భోయనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు.

చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు.

ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభని ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.

ఎంతముద్దుచేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు.

నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానాయాగీ చేసేసింది.

నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదుపొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది.

ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో?

పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు.

‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు.

నీకుతోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు.

తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.

ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు.

డబ్బడిగితే జేబుఖాళీ అంటారు.
పన్చెబితే చెయిఖాళీలేదంటారు.

అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు.

వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు.

నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజుబిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠికిందే పడుకున్నావు.

ఒకటారెండా..పధ్నాలుగేళ్ళు!

ఎన్నోతప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు.

జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మాసరదా తీర్చకుండా బయటే ఊరేగుతూవుంటారు.

అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు.

అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచినవెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు.

నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు.

ఇంటో అన్నీవుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం!

అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆలేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపెంచెంది,  తెద్దాఁవని బయల్దేరావు.

మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు.

ఏమాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు.

నిస్సహాయతనేది సామాన్యమానవుణ్ణి ఎలాబాధిస్తుందో నిరూపించావు.

మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు.

ఎంతో ఇష్టంకాబట్టే ఎంతకష్టపడాలో అంతాపడ్డావు.

ఏసాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ ఆరుమెట్ల పుస్తకాలూ చెప్పలేదు.

తాతయ్య నోటివెంట నీకథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోడమని!

అదీ చూసేవాళ్ళం మాచిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం!

వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది!

ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువుచేసిన స్నేహమూ, ఆనక వాళ్ళసాయంతోనే నువుకట్టిన వారధీ చూస్తే...

దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!

సెభాషోయ్ రామా! నీగురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా!

నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీజీవితం!

నిలకడలేనివాళ్ళతో పొంతన
నీళ్ళని దాటడానికొక వంతెన
నిర్భయమేగావుంటే నీచెంతన
నిరాధారులకిచ్చావు సాంత్వన
నికార్సైనది నీమార్గం ఎంతైనా
నిరతమూ మాకదేకదా చింతన

నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!

నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని
నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!

పదిమందీ కలిస్తే పండగ! పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!

అందాలరాముడు....
అందువలన దేముడు!!

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

                          ..........జగదీష్ కొచ్చెర్లకోట

Sri Rama Navami 2017

శ్రీ రామ నవమి శుభాకంక్షాలు.
రాముడి కి ఇది

1లక్ష 04వేల 257 వ...పుట్టినరోజు అని FB ఫ్రెండ్ ఒకరు పోస్ట్ చేసారు....
నిన్న మా అమ్మాయికి తులసి మొక్క ఇంట్లో ఎందుకు పెంచుకోవాలి అని చెబితే ఇలా reason చెబితే మేము ఫాలో అవుతాము కదా.....ఊరికే ఇది చేయండి మంచిది అని చెప్పే బదులు అన్నది...    .అలాగే ఇన్ని సంవత్సరాలు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే. ఎన్నని చెబుతాము. ..రాముడు అంటేనే ధర్మము కాబట్టి.
రాముడు సీతకి అన్యాయం చేసాడు సీతని అడవిలో వదిలేసే అనుకునేదాన్ని నేను కూడా...చాలా రోజులు.... కానీ ఇప్పుడు అనిపిస్తుంది....వాళ్ళ అన్యోన్య దాంపత్యములో వాళ్ళ ఇద్దరికి కారణాలు  బయటకు చెప్పుకోవాలిసిన అవసరము లేదు అని. ఆయన చేశారు...ఆవిడకి అర్ధం అయింది....భార్య భర్తల మధ్యలో మనము ఎవరండి మాట్లాడడానికి అని అర్ధమైంది.
మనిషి పాటించవలసిన అన్ని ధర్మాలు రాముడు సీతా , ఆ మాటకొస్తే భరతడు, లక్ష్మణుడు ఏమైనా తక్కువా? అందరూ ఆచరించారు మనకు ప్రమాణాలు చూపారు....అవన్నీ అందరమూ పాటించగలమా?? ఖచ్చితంగా లేము...
మరి మన నడతలో సందేహము వచ్చింది అనుకోండి శ్రీ రామ పరివారములో ఎవరో ఒకరు మనకు దారి చూపుతారు  ...
ఉడుత దగ్గర నించి దేశము ఏలిన భరతుడు వరకు.....అందరికి ఎప్పుడు ఏమి ,ఎలాచేయాలో తెలుసు.....ఒకసారి చదివి చూద్దాం...ఏ సందేహము కైనా సమాధానం దొరుకుతుంది...ఒక వేళ  దొరకలేదు అనుకోండి విషవృక్షాలు మొలిపించ వద్దు..  .రామాయణం కల్పవృక్షం....దాని నీడన సేద తీరుతూ శ్రీరామ రక్షతో అయురాగ్యాలతో  ఆనందముగా ఉందాము

Thursday, September 14, 2017

Akruthi Public School 14-09-2017

పిల్లలు కి సరైన guidance ఇచ్చి వారికి దిశ నిర్దేశం చేయడములో స్కూల్ ది 50% ,తల్లితండ్రులది 25%
సంఘంది, 25% పాత్ర అని School Psychology ప్రకారం వున్నా, School వంతుగా 75% చేస్తే పిల్లల్లకు మంచిది అని నమ్మి , ఆచరిస్తున్న
          AKRUTHI PUBLIC SCHOOL KARMANGHAT,PRINCIPAL Smt. Madhavi గారికి అభినందనలు.

ఇవాళ ఆ స్కూల్ లో 8th,9th,10th క్లాస్ పిల్లల్లకు  Life Skills గురించి Sahaja Team , #Sahaja Motivational class తీసుకోవడం జరిగింది.

Smt. Sailaja Vissamsetti-
Organising Secretary,Telangana Psychologists Association
Smt. Jonnalagadda Kanaka Durga-
Joint Secretary for Hyderabad District ,Telangana Psychologists Association
Sri Sudhakar-Member, Telangana Psychologists Association.
Participated and Interacted with children.

Sahaja Team wishes Good Luck to the children




Sunday, September 10, 2017

10-09-2017 World Suicide Prevention Day

"Suicide is not a wish to die-but a CRY for help"
September 10th World Suicide Prevention Day గా పాటిస్తున్న సందర్భంగా ఇవాళ
 Telanga Psychologists Association-TPA వారు ఒక కార్యక్రమం నిర్వహించారు.

TPA President Sri Mothukuri Ramchander గారి ఆధ్వర్యంలో,Smt. G.C. Kavitha,Counselling Psychologist, గారు ముఖ్య అతిధిగా ఈ సభ జరిగింది.
"దర్షిక " సంస్థ నుంచి Sri Balaji గారు ముఖ్య వక్త.

ఏటా 1,35,000 మంది భారతదేశం లో ,దాదాపు 10,00,000 మంది ప్రపంచ వ్యాప్తముగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ParaSympathetic Nervous System వలన వచ్చే వత్తిడి మన శరీరము లోని Seritonin మరియు Cortisol Hormones లోని అసమతుల్యత వలన ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
మన శరీరంలో Seritonin ఎక్కువ  ఉండాలి .దానికి వ్యాయామం,ముఖ్యముగా యోగ మరియూ ధ్యానము ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఈ Cortisol హార్మోన్ ఎక్కువ అయితే మనము ఏమి చేస్తున్నామో మన మనసు కి పట్టదు.

 ఈ medical  కారణాలు కాకుండా మానసికంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణము -----ఒత్తిడి.

ఒత్తిడి లేక Stress అన్నది ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి ఎవరు లేరు అని అనుకున్నప్పుడు కలుగుతుంది.

ఒత్తిడి లో వున్నప్పుడు మన మనసు మన మాట వినదు. సరైన నిర్ణయాలు తీసుకొనలేదు. అంతే కాకుండా ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఆ సమయములో వారికి కావలసింది ఒక Empathetic Listener. వారికి మన సానుభూతి అఖ్ఖర్లేదు.కానీ మనం వారికి ఉన్నాము అన్న ఒక ధైర్యం కావాలి.
ఆత్మహత్యలు నివారించాలంటే మనకు కావలసింది "నేను ఒంటరిని కాదు "అన్న అవగాహన వారి లో కలిగించాలి.
I am not alone -అన్న ధైర్యం వారికి కలిగించాలి.
ఒక మాట,ఒక క్షణం చాలు ఆత్మహత్య లు నివారించడానికి.
అందుకే ఈ సంవత్సరం Motto
           "TAKE A MINUTE, CHANGE A LIFE"
Interpersonal relations లో Communication  లేకపోవడము ఆధునిక సమాజము లో ఒంటరితనానికి,
పంచుకునే వారు లేక ఒత్తిడికి గురైనా వారు,
ఒక్క క్షణం ఆలోచిస్తే...
వారితో ఉండేవారు వారి గురించి ఒక్క నిమిషం కేటాయిస్తే....
ఒక ఆత్మహత్య అగుతుంది,ఒక జీవితం నిలబడుతుంది.
రండి మన మనసు తో విందాము....
ఒక జీవితాన్ని బ్రతికిద్దాము.
ఆత్మహత్య ను నివారిద్దము.
Jonnalagadda Kanakadurga
In Face Book


Wednesday, September 6, 2017

Counselling at Kishanreddy School 31-08-2017

గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది కానీ,పిల్లలు భలే హుషారుగా వున్నారు.
మొన్న ఆగస్ట్ 31వ తారీఖు న బాగ్ అంబర్ పేట్ లోని గవర్నమెంట్ హైస్కూల్ పిల్లల్లకి మా Sahaja team "Motivational Class" తీసుకోవడానికి వెళ్ళాము.

"Sahaja" అన్నది ఒక  Professional Psychologists Group. Baghamberpet Corporator  Padmavathi DP Reddy గారు "WOW"Association లో  Wellness aspect లో భాగముగా ,Telangana Psychologists Association తరపున  మా "Sahaja" Team పాల్గొన్నాము.
 పిల్లలతో మాట్లాడం,వారితో భావాలు పంచుకోవాడానికి,నాలుగు మంచి మాటలు చెప్పడానికి మేము ఎప్పుడు ముందుంటాము.

Sahaja Team నించి
Smt.Sailaja Vissamsetti-Organising Secretary- Telangana Psychologist Association
Smt.Jonnalagadda Kanaka Durga-Joint Secretary for Hyderabad District, TPA
Sri Vara Prasad- Secretary for Medak District ,TPA ఈ స్కూల్ కి వెళ్ళాము.

స్కూల్ కి వెళ్లినాక 8th,9th క్లాస్ పిల్లల్ని ఒక రూమ్ లో సమావేశపరిచారు..వాళ్ళకి digi class వుండడము వలన slides తో వారికి అర్ధం అయ్యేలా చెప్పడము మాకు చాలా సులువు అయింది.
ప్రిన్సిపాల్ రూమ్ లో కి వెళ్తుండగానే ఎదురుపడిన పిల్లలు చక్కగా విష్ చేశారు. ముందర కాస్త బిడియపడినా,ఒక 5 నిమిషాలు తరువాత అడిగిన ప్రశ్నలకు ఎంత హుషారుగా సమాధానము చెప్పారో.
"మీ రోల్ మోడల్ ఎవరు అనగానే చాలా మంది పిల్లలు"అబ్దుల్ కలామ్"అని చెప్పటం మన భవిత మీద చాలా ఆశ కలిగించింది..
వాళ్లలో కలిగిన ఆశయానికి నిజముగానే సరైన మార్గానిర్దేశన చేయగలిగితే...నిజముగానే Abdul Kalaam అంత స్థాయి కి చేరగలుగుతారు.
మా Sahaja team లో Smt.Sailaja గారు వారికి తల్లిదండ్రుల మరియు గురువుల యొక ప్రాముఖ్యత గురించి చెప్పగా,
Sri Vara Prasad గారు వారికి PPT slides ద్వారా "Essence of Life & Running your own race"
గురించి చక్కగా వివరించారు.
నేను వారికి చదువుకోవడం యొక్క అవశక్యత,దాని కోసం చేయవలసిన పరిశ్రమ గురించి చెప్పాను.
చివరగా Sailaja గారు Gadgets యొక్క వినియోగం. ...జాగ్రత్తలు,.BlueWhale గేమ్ వాళ్ళ దుష్ప్రభావాలు గురించి చెప్పారు.
Corporator Padmavathi గారు ముఖ్య అతిధిగా విచ్చేసి పిల్లల చదువుకోవడం చాలా అవసరము. ఉన్న వసతులు ఉపయోగించుకుని ఉన్నత స్థానంకి చేరాలని...అందుకు సహాయము చేయడానికి ఎల్లవేళలా తాను సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ప్రిన్సిపాల్ ప్రసూన గారు పిల్లల్లుకు ఇంకా యోగ, ధ్యానంలో శిక్షణా ఇప్పించాలని మిగతా తరగతి పిల్లలకు కూడా ఇలాగ classes conduct చెయ్యాలని కోరారు.